Gold Price: రాసిపెట్టుకోండి.. లక్ష దాటేస్తా.. తొడగొడుతున్న పసిడి..!
1990లో అంటే 35 ఏళ్ల కిందట.. కిలో బంగారం మూడులక్షలకు అటూఇటూ ఉండేది. అప్పట్లో దాంతో మారుతీ కారు కొనుక్కోవచ్చు. 2005లో కిలో బంగారం ఏడులక్షలకు పెరిగింది. టాటా ఇన్నోవా ధరకు ఇది ఈక్వల్. 2019లో అదే కిలో బంగారంతో BMW బేసిక్ మోడల్ కారు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడైతే కిలో బంగారం కోటి రూపాయలకు దిగువకు చేరింది. మరో పదేళ్లు ఆగితే.. కిలో పసిడి ధరకు రోల్స్ రాయిస్ హైఎండ్ కారే కొనొచ్చు. బంగారం ధరల దూకుడు గురించి అడిగితే.. సెబీ ఎకనమిక్ అడ్వైజర్ ఏ.కే. మంథన్ చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. మరి.. రాకెట్ వేగంతో దూసుకుపోతున్న పసిడి ధరలకు స్పీడ్ బ్రేకర్లు పడతాయా..?

మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లు ఆచితూచి అడుగెయ్యాల్సిందే..! సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్.. తర్వాత ఆగమాగమైతే మాది కాదు పూచీకత్తు.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి ముందే చేతులెత్తేస్తుంది రిజర్వ్ బ్యాంక్. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం మీద పైసలు పెట్టే వాళ్లకు అటువంటి భయమే అవసరం లేదు. రిస్క్ అనే మాటకే ఇక్కడ చోటు లేదు. నేను విన్నాను.. నేను ఉన్నాను అంటూ అభయహస్తమిచ్చి పిలుస్తోంది పసిడిమాలక్ష్మి. బంగారానికేది పోటీ.. బంగారానికెవడు పోటీ.. బంగారానికెక్కడ పోటీ..? అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా బంగారానిదేగా భవిష్యత్తు? గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. ఇవాళున్న ఆర్థిక పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకుంటే.. మన పెట్టుబడికి మినిమమ్ కాదు మాగ్జిమమ్ గ్యారంటీలిచ్చే సత్తా ఒక్క బంగారం దగ్గరే కనిపిస్తోంది. రేపటి భవిష్యత్తు కోసం కూడబెట్టే ప్రతీ పైసాకు భారీ లాభాలనిచ్చే పూచీ నాది అని ఒట్టేసిమరీ చెబుతున్నట్టుంది పసిడిమాతల్లి హవా.. బులియన్ మార్కెట్‌లో లేటెస్ట్ ట్రెండే కాదు, గత పాతికేళ్లుగా గోల్డ్ ధర ఏటా ఏ రేంజ్‌లో పెరుగుతోందో పరిశీలిస్తే.. పెట్టుబడికి బంగారాన్ని కొట్టే మార్గం ఇంకోటి లేనే లేదని ఇట్టే తేలిపోతుంది. పెరుగుతుందా తగ్గుతుందా అని కాదు.. ఎంత పెరుగుతుంది..? ఎందాకా పెరుగుతూనే ఉంటుంది..? ఇది కదా అడగాల్సింది? ఇవాళా.. రేపూ.. షాపుల్లోకెళ్లి బంగారం ధరల గురించి ఆరా తియ్యాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. మూడు నెలల కిందట మార్కెట్‌లో కనిపించి.. బంగారం ధర పెరుగుతుందా తగ్గుతుందా అనే...