- Telugu News Photo Gallery Business photos Airport Rules Change: Now these items cannot be taken in the plane during travel, otherwise fine will be imposed
Airport Rules Change: మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? ఇవి తీసుకెళ్తే భారీ జరిమానా.. జాగ్రత్త!
Airport Rules: మీరు విమాన ప్రయాణం చేస్తారా..? అయితే మీ వెంట ఎలాంటి వస్తువులు తీసుకెళ్తున్నారు? ప్రయాణంలో కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్తే భారీ జరిమానా విధిస్తారు ఎయిర్‌పోర్ట్ అధికారులు. అందుకే విమానంలో ప్రయాణం చేసేవారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లాలి..? ఎలాంటి వస్తువులపై నిషేధం ఉంటుందనే విషయం ముందస్తుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం..
Updated on: Mar 25, 2025 | 8:09 PM

Airport Rules: సురక్షితమైన విమాన ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకుని, విమానాశ్రయం తన నిబంధనలలో మార్పులు చేస్తుంటుంది. ఈ ప్రత్యేక మార్పులు దుబాయ్ విమాన ప్రయాణికుల కోసం. ఇటీవల చేసిన మార్పుల ప్రకారం.. సాధారణంగా ప్రజలు క్యాబిన్ బ్యాగ్‌లో మందులు వంటి అవసరమైన వస్తువులను, ముఖ్యంగా మందులను తీసుకెళ్లవచ్చు. అయితే ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానాల్లో ఇది సాధ్యం కాదు. మీరు అన్ని రకాల మందులను తీసుకెళ్లలేరు. కొత్త నిబంధనల ప్రకారం, మీరు అనుమతించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లాలి

చాలా సార్లు వ్యక్తులు తమకు తెలియకుండానే అలాంటి వస్తువులను తమ వెంట తీసుకెళ్తుంటారు. వీటిని విమానంలో తీసుకెళ్లడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. దుబాయ్ ఫ్లైట్‌లో చెక్-ఇన్ లగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో ఏమి ప్యాక్ చేయవచ్చు. మీరు దుబాయ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది త తెలుసుకోవడం చాలా ముఖ్యం. దుబాయ్ ప్రయాణంలో మీరు చాలా నియమాలను పాటించాలి. బ్యాగులో ఎలాంటి లగేజీ తీసుకెళ్తున్నారో మీరే చూసుకోవాలి.

వీటిని బ్యాగ్‌లో తీసుకెళ్లలేరు: మైకము కలిగించే కొకైన్, హెరాయిన్, గసగసాలు, నార్కోటిక్ డ్రగ్స్, తమలపాకులు, కొన్ని మూలికలు మొదలైనవి కూడా తీసుకెళ్లలేరు. ఏనుగు దంతాలు, ఖడ్గమృగాల కొమ్ము, జూదం సాధనాలు, మూడు పొరల చేపలు పట్టే వలలు, బహిష్కరించిన దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను తీసుకెళ్లడం కూడా నేరంగా పరిగణిస్తారు. అలాగే ప్రింటెడ్ మెటీరియల్, ఆయిల్ పెయింటింగ్స్, ఛాయాచిత్రాలు, పుస్తకాలు, రాతి విగ్రహాలను కూడా తీసుకెళ్లకూడదు. నకిలీ కరెన్సీ, ఇంట్లో తయారుచేసిన ఆహారం, ఇంట్లో తయారు చేసిన నాన్ వెజ్ కూడా తీసుకెళ్లకూడదు. ఒక ప్రయాణికుడు నిషేధిత వస్తువులను తీసుకువెళుతున్నట్లు తేలితే, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.

తీసుకెళ్లాల్సినవి: దుబాయ్‌కి వెళ్లేటప్పుడు తీసుకెళ్లడానికి అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఈ జాబితాలో మొక్కలు, ఎరువులు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు, సౌందర్య సాధనాలు, ప్రసార, వైర్‌లెస్ పరికరాలు, మద్య పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఇ-సిగరెట్లు, ఎలక్ట్రానిక్ హుక్కా ఉన్నాయి.

తీసుకెళ్లేందుకు సాధ్యం కాని మందులు: బీటామెథోడాల్, ఆల్ఫా-మిథైల్ఫెనిడైల్, గంజాయి, కోడాక్సిమ్, ఫెంటానిల్, గసగసాల గడ్డి, మెథడోన్, నల్లమందు, ఆక్సికోడోన్, ట్రైమెపెరిడిన్, ఫెనోపెరిడిన్, కాథనోన్, కోడైన్, అంఫేటమిన్.





























