Carrot Juice Benefits: క్యారెట్ జ్యూస్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, జీర్ణ క్రియకు సహాయపడి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.