చాణక్య నీతి : ఎంత గొప్ప చదువులు చదివినా.. తెలివిలేనివారిగా మిగిలేది వీరే!

Samatha

28 December 2025

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన కాలంలో గొప్ప జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు.

చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

ఇక చాణక్యుడు ఎన్నో విషయాల గురించి తెలియజేసిన విషయం తెలిసిందే. చదువు, డబ్బు, బంధాలు, బంధుత్వాలు ఇలా చాలా విషయాల గురించి తెలియజేశారు.

అదే విధంగా ఆయన చదువు ఉన్నా సమాజంలో తెలివి లేని వారిగా మిగిలే వారి గురించి తెలియజేయడం జరిగింది. వారు ఎవరో చూద్దాం.

చదువు అనేది నేర్చుకునే అలవాటు, అర్థం చేసుకునే అలవాటు ఉన్నవారికే చదువు అనేది ఉపయోగపడుతుంది. ఇవి ఏవీ లేకున్నా వ్యర్థం అంట.

ముఖ్యంగా ఆలోచించే సామర్థ్యం ఉన్నవారికే చదువు సహాయపడుతుంది. తెలివి తక్కువ వారికి విద్య అనేది ఏ విధంగా ఉపయోగపడదంట.

చాణక్యుడి ప్రకారం జ్ఞానం సంపాదించుకోవడంలో ఆసక్తిలేని వారికి విద్య వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేర్చుకున్న విద్యను ఉపయోగించుకోకపోవడం వ్యర్థం.

చదువులో క్రమశిక్షణ , ఆత్మ నియంత్రణ చాలా అవసరం, ఈ లక్షణాలు లేకుండా ఏ వ్యక్తి జ్ఞానాన్ని పొందడం అనేది జరగదు.

అందుకే అలాంటి వ్యక్తులు ఎంత చదువుకున్నా వృథానే, వారు ఎప్పుడూ చదువు ఉండి తెలివిలేనివారిగానే మిగులుతారు అంటున్నాడు చాణక్యుడు.