కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న చిత్రం కన్నప్ప. మహా భారతం హిందీ సీరియల్ డైరెక్టర్.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా సినిమాలోని పాత్రధారుల ఫస్ట్ లుక్ పోస్టర్లను పేర్లతో సహా రివీల్ చేశారు మేకర్స్. వీటికి అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఇక సాంగ్స్ కు కూడా మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో కొంత మంది నెటిజన్లు కన్నప్ప సినిమాను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఇదే విషయంపై మంచు విష్ణుతో పాటు సీనియర్ యాక్టర్ రఘుబాబు షాకింగ్ గా రియాక్టయ్యారు. కొంతమంది ఏదైనా క్లిప్‌ను కట్ చేసి దాన్ని వైరల్ చేసి ట్రోల్స్, కాంట్రవర్సీ చేయడం వంటివి చేస్తున్నారు. వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు మంచు విష్ణు. ఈ మధ్యన జనాలు కూడా చాలా స్మార్ట్‌గా తయారయ్యారని.. ఏదైనా కాంట్రవర్సీ అయితే పూర్తి వీడియోను నెట్టింట సెర్చ్ చేసి చూస్తున్నారన్నారు. మరికొందరు మాత్రం పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పాడు. అయినా అలాంటివి తాను పట్టించుకోనంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..
బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా