పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రస్తుతం సంబరాల ఏటి గట్టు అనే సినిమా చేస్తున్నాడు. తేజ్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. కెరీర్ లో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. ఆతర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తేజ్ సంపత్ నంది డైరెక్షన్లో గంజా శంకర్ అనే సినిమాను ఆ మధ్య అనౌన్స్ చేశాడు.
ఓ వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశాడు.అయితే ఆ తర్వాత కాంట్రో కు కేరాఫ్‌గా మారిన ఈ టైటిల్ అండ్ సినిమా పై ఇన్ని రోజుల తర్వాత డైరెక్టర్ సంపత్ నంది రియాక్టయ్యాడు. సంపత్ నంది ప్రస్తుతం ఓదెల 2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సంపత్ మాట్లాడుతూ… గాంజా శంకర్‌ను సినిమా ఆపేసటిట్టు చెప్పి షాకిచ్చాడు. గంజా శంకర్ సినిమాకు పోలీసులు నోటీసులు ఇచ్చారని.. టైటిల్ మార్చితే అభ్యంతరం లేదని చెప్పారని చెప్పారన్నాడు. అయితే టైటిల్ మార్చితే కథ పూర్తిగా మార్చాలి దాని కంటే సినిమా ఆపేయడమే బెటర్ అనిపించింది అందుకే ఆ సినిమాను ఆపేశాం అంటూ చెప్పాడు సంపత్ నంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిగ్ బాస్ హౌస్‌లో చీటింగ్ ఇలా జరుగుతుంది.. ! సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా