‘వాట్ ఇండియా థింక్స్ టుడే 2025’ 3వ ఎడిషన్‌కు రంగం సిద్ధం.. ప్రధాని మోదీతోపాటు పాల్గొనే ప్రముఖులు వీరే?
What India Thinks Today: 'వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) 2025' మూడో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీలోని ప్రసిద్ధ భారత్ మండపంలో రెండు రోజుల ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో జరగనున్న ఈ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు 11 మంది కేంద్ర మంత్రులు, ఐదుగరు ముఖ్యమంత్రులు కూడా TV9 నెట్‌వర్క్ ఈ వార్షిక కార్యక్రమంలో పాల్గొంటారు.

What India Thinks Today: దేశంలోని అతిపెద్ద వార్తా నెట్‌వర్క్ టీవీ9 మరోసారి వాట్ ఇండియా థింక్స్ టుడే (What India Thinks Today 2025) మూడవ ఎడిషన్‌తో మన ముందుకు వచ్చింది. ప్రతిష్టాత్మక ఆలోచనలతోపాటు, లోతైన మేధోమథన వేదిక మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా దేశంలోని, ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ వ్యక్తులు హాజరవుతారు. మత గురువు ధీరేంద్ర శాస్త్రి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార అధిపతి సునీల్ అంబేకర్ కూడా తమ అభిప్రాయాలను ఇక్కడ చెప్పేందుకు సిద్ధమయ్యారు.
వాట్ ఇండియా థింక్స్ టుడే 2025 ఈ గొప్ప వేదిక ఢిల్లీలోని ప్రసిద్ధ భారత్ మండపంలో నిర్వహినున్నారు. ఈ కార్యక్రమం మార్చి 28, 29 తేదీలలో జరుగుతుంది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలతో పాటు, వినోదం, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలు వంటి అనేక ముఖ్యమైన అంశాలు వాట్ ఇండియా థింక్స్ టుడే వేదికపై చర్చించనున్నారు.
WITT కి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ మండపం..
భారత్ మండపంలోని ఆడిటోరియం 1లో జాతీయ ఎజెండా జరుగుతుంది. సమ్మిట్ రూమ్‌లో న్యూస్ నైన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ బిజినెస్ అండ్ ఎకానమీపై చర్చించనున్నారు. జాతీయ అజెండా ప్రకారం, భోజన విరామానికి ముందు 5 సెషన్లు ఉంటాయి. లంచ్ సెషన్ తర్వాత 8 సెషన్లు ఉంటాయి. న్యూస్ నైన్ గ్లోబల్ సమ్మిట్ బిజినెస్ అండ్ ఎకానమీ కింద, ప్రపంచ ప్రముఖులు ఈ వేదికపై 10 సెషన్ల ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
మహా వేదికపై 11 మంది కేంద్ర మంత్రులు, 5 గురు ముఖ్యమంత్రులు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, 11 మంది కేంద్ర మంత్రులు కూడా ఈ ప్రతిష్టాత్మక వేదికలో పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి అనుప్రియా పటేల్ కూడా హాజరవుతారు. గత సంవత్సరం ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’లో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. WITT గ్లోబల్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.
వీరితో పాటు, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వేదికపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తమ తమ రాష్ట్రాల భవిష్యత్తు రోడ్ మ్యాప్ గురించి టీవీ9 నెట్‌వర్క్ వేదికపై సమాచారాన్ని అందిస్తారు.
వేదికపై అఖిలేష్ యాదవ్, ఖర్గే కూడా..
TV9 ఈ వేదికపై, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వ విధానాలు, దేశ ప్రస్తుత పరిస్థితులపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్, వాట్ ఇండియా థింక్స్ టుడే 2025 అనే అంశంపై మాట్లాడుతూ, ‘భారతదేశం ఎల్లప్పుడూ కొత్త ప్రపంచ క్రమం వైపు కదులుతూనే ఉంది. ఇక్కడ యుద్ధానికి తావులేదు. ప్రపంచ వినియోగదారులకు అడ్డంకులను సృష్టించే ఆర్థిక జాతీయవాదం లేదు’ అని ఆయన అన్నారు. ‘దేశాన్ని ముందుంచాలన్న భారతదేశం పిలుపు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించింది’ చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశం తన నాగరిక వారసత్వాన్ని ఉపయోగించి ప్రపంచ స్థిరత్వంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుకుంటోందని తెలిపారు.
‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే మన లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి దేశీయ సవాళ్లను, ప్రపంచ అవకాశాలను పరిష్కరించుకుంటూ ఈ అంశాల మధ్య సమతుల్యతను సాధించడానికి ప్రయత్నిస్తున్నందున రాబోయే దశాబ్దం భారతదేశానికి చాలా ముఖ్యమైనది’ అని ఆయన అన్నారు.
వ్యాపార ప్రపంచంలోని బడా వ్యక్తులు కూడా..
ప్రపంచ వ్యాప్తంగా ప్రసంగించేవారిలో UNGA మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్, భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్, భారతదేశం కోసం UN రెసిడెంట్ కోఆర్డినేటర్ షోంబి షార్ప్ ఉన్నారు. వ్యాపార ప్రపంచంలోని అనేక మంది ప్రముఖ వ్యక్తులు కూడా పాల్గొంటారు.
వేదాంత కంపెనీ వ్యవస్థాపకుడు, CEO అనిల్ అగర్వాల్‌తో పాటు, భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్, నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్, కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ MD నీలేష్ షా, మెదాంత ఎండీ, ఛైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ వంటి అనేక మంది ప్రముఖులు కూడా దేశ అభివృద్ధి మార్గంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..