26 December, 2025
Subhash
బంగారం, వెండి ధరలు అడ్డూ అదుపులేకుండా దూసుకుపోతున్నాయి. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా ధరలు భగ్గుమంటున్నాయి.
వెండి మరో చారిత్రక రికార్డును నమోదు చేసుకుంటోంది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.9,750 ఎగబాకి రూ.2,27,000కి చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 72 డాలర్లు పలకడంతో దేశీయ ధరలు పుంజుకుంటున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గురువారం ఈ ధర రూ.2,40,000లకు చేరుకుంది.
గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి ఆల్‌టైం హైకి 72 డాలర్లకు చేరుకోవడం వల్లనే దేశీయంగా అధికమవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఇప్పటి వరకు వెండి ఏకంగా రూ.1,37,300 (153 శాతం) ఎగబాకింది. గతేడాది డిసెంబర్ 31న రూ.89,700గా ఉంది.
ప్రస్తుతం కిలో వెండి ధర కొనుగోలు చేయాలంటే 2 లక్షల 40 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
డాలర్ బలహీనంగా ఉండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లడం, ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ధరల పెరుగుదలకు కారణం.
ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర 2,54,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇతర నగరాల్లో రూ.2,40,000 వద్ద ఉంది.