INDW vs SLW: హాఫ్ సెంచరీతో షెఫాలీతో బీభత్సం.. మూడో టీ20లోనూ భారత్‌దే విజయం.. సిరీస్ కైవసం..
India Women vs Sri Lanka Women, 3rd T20I: షఫాలీ ధాటికి భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన త్వరగానే అవుట్ అయినప్పటికీ, షఫాలీ జోరుతో భారత్ ఎక్కడా తడబడలేదు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో 2 మ్యాచ్‌లు ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

India Women vs Sri Lanka Women, 3rd T20I: తిరువనంతపురం వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సర్వశక్తులూ ఒడ్డి శ్రీలంకను ఓడించింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
బౌలర్ల విజృంభణ – కుప్పకూలిన లంక..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టుకు భారత పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్ చుక్కలు చూపించింది. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ తీసింది. రేణుకా 4 ఓవర్లలో కేవలం 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. మరోవైపు స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ 3 వికెట్లతో చెలరేగింది. ఈ క్రమంలోనే టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి భారత ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. వీరిద్దరి ధాటికి శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.
షఫాలీ వర్మ ‘మారణహోమం’..
113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షఫాలీ వర్మ వీరోచిత ఆరంభాన్ని ఇచ్చింది. మొదటి ఓవర్ నుంచే లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన షఫాలీ, మైదానాన్ని బౌండరీలతో హోరెత్తించింది. కేవలం 42 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె స్ట్రైక్ రేట్ (188.09) చూస్తే లంక బౌలర్లను ఆమె ఎంతలా ఆడుకుందో అర్థం చేసుకోవచ్చు.
భారత్ ఘన విజయం..
షఫాలీ ధాటికి భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన త్వరగానే అవుట్ అయినప్పటికీ, షఫాలీ జోరుతో భారత్ ఎక్కడా తడబడలేదు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో 2 మ్యాచ్‌లు ఉండగానే 3-0 తేడాతో కైవసం చేసుకుంది.
క్లినికల్ పర్ఫార్మెన్స్..
ఈ విజయంలో బౌలర్లు వేసిన పునాదిని బ్యాటర్లు సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో కూడా భారత క్రీడాకారిణులు చురుగ్గా కదిలి లంక బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
