వాట్ ఇండియా థింక్స్ టుడే
దేశ రాజధాని ఢిల్లీలో ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV9 నిర్వహించనున్న ఈ సమ్మిట్‌లో దేశ రాజకీయాలు, పాలన, ఆర్థిక శాస్త్రం, ఆరోగ్యం, సంస్కృతి, క్రీడలతో సహా అనేక కీలక అంశాలు చర్చించబడతాయి. ఈ మూడు రోజుల సదస్సు ఫిబ్రవరి 25న ఆదివారంనాడు ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగుతుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు.
‘వాట్ ఇండియా థింక్స్ టుడే’లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, భూపేంద్ర యాదవ్, స్మృతి ఇరానీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ కూడా తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. దీంతో పాటు ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, మాల్దీవుల మాజీ రక్షణ మంత్రి మరియా అహ్మద్ దీదీ, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ సహా కళారంగం, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు.