- Telugu News Photo Gallery Cinema photos WITT Global Summit 2025 Tollywood Actor Vijay Deverakonda Interesting Comments About His Film Career
Vijay Deverakonda: తెలుగు సినిమా అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తా.. ‘టీవీ9 వాట్ ఇండియా థింక్స్ టుడే’ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ..
టీవీ9 నెట్ వర్క్ నిర్వహిస్తున్న 'వాట్ ఇండియా థింక్స్ టుడే' గ్లోబల్ సమ్మిట్ 2025 శుక్రవారం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ప్రణాళికలపై చర్చించారు. అలాగే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ యమీ గౌతమ్ సైతం పాల్గొన్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Rajitha Chanti
Updated on: Mar 29, 2025 | 11:50 AM

కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ తెలుగు సినిమా అభివృద్ధిలో ఒక స్టార్ హీరోగా తన వంతు కృషి చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. టీవీ9 ఢిల్లీలో నిర్వహించిన 'వాట్ ఇండియా థింక్స్ టుడే' కార్యక్రమంలో గెస్ట్ గా పాల్గొన్నారు విజయ్ దేవరకొండ. హీరోగా తన సక్సెస్, గ్లోబల్ గా తెచ్చుకున్న గుర్తింపు, పాన్ ఇండియా ట్రెండ్ లో టాలీవుడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ వంటి అంశాలతో పాటు తన కొత్త సినిమా "కింగ్ డమ్" విశేషాలు ఈ కార్యక్రమంలో తెలిపారు విజయ్ దేవరకొండ.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు.

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - హీరోగా గ్లోబల్ గుర్తింపు తెచ్చుకోవడం, ఇంతమంది అభిమానం పొందడం మాటల్లో చెప్పలేని సంతోషాన్నిస్తోంది. ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నా, ఏ కొద్ది మందికో దక్కే అవకాశమిది. మనం అన్నిసార్లూ సక్సెస్ ఫుల్ సినిమాలు చేయకపోవచ్చు.

సక్సెస్, ట్రెండ్ అనేది ఒక సర్కిల్ అయితే అందులో ఇప్పుడు టాలీవుడ్ వంతు వచ్చింది. రేపు మరో ఇండస్ట్రీ లీడ్ తీసుకోవచ్చు. మన దగ్గర ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. దర్శకులు నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా తమ మొదటి సినిమా నాతో చేశారు. ఇవాళ నేనిక్కడ ఉన్నానంటే వారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు అదొక పెద్ద రిస్క్. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కానీ సాహసం చేశారు.

ప్రతి ఇండస్ట్రీ ఇలాంటి స్ట్రగుల్ పడాలి. అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేయగలదు. నా కొత్త సినిమా "కింగ్ డమ్" టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో తారక్ అన్న, తమిళంలో సూర్య, హిందీలో రణ్ బీర్ కపూర్ తమ వాయిస్ లతో మా టీజర్ ను మరింత ఎఫెక్టివ్ గా చేశారు. వారి వాయిస్ వల్ల మా టీజర్ ఇంకా బాగా ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ప్రేక్షకులకు సరికొత్త కథలు చెప్పాలి, టాలీవుడ్ సక్సెస్ లో నా వంతు కృషి చేయాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు.





























