Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత

WITT 2025: టీవీ9 నెట్‌వర్క్ 'వాట్ ఇండియా థింక్స్ టుడే' మూడవ ఎడిషన్ మార్చి 28న జరిగింది. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు..

WITT 2025: టీవీ9 సమ్మిట్‌లో ప్రధాని మోదీ.. అబుదాబిలో ప్రధాని ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Follow us
Subhash Goud

|

Updated on: Mar 31, 2025 | 3:35 PM

టీవీ9 నెట్‌వర్క్ ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ మూడవ ఎడిషన్ మార్చి 28న ప్రధాని మోదీ ప్రసంగంతో ప్రారంభమైంది. హోటల్ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి.. వందల మంది సమక్షంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు టీవీ9ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. త్వరలోనే ఇతర మీడియా సంస్థలు కూడా దీనిని అనుసరించాలని మోడీ పిలుపునిచ్చారు. మీ నెట్‌వర్క్‌ను ప్రపంచ ప్రేక్షకులు అనుసరిస్తున్నారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వీక్షించడానికి భారత్‌లోనే కాకుండా అనేక దేశాల ప్రజలు వీక్షిస్తున్నారని అన్నారు.

Tv9 Witt Summit 2

ఈ ప్రత్యేక సందర్బంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినడానికి లులు గ్రూప్ అబుదాబిలో భారీ ఏర్పాట్లు చేసింది. లులు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ, అతని బృందం ప్రధాని మోడీ చెప్పిన విషయాలను విన్నారు.

Tv9 Witt Summit 3

భారతదేశంలో యూసుఫ్ అలీ పెట్టుబడి:

లులు గ్రూప్ ఇంటర్నేషనల్ భారతదేశ ఆహార ప్రాసెసింగ్, రిటైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అబుదాబిలోని బహుళజాతి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ యూసుఫ్ అలీ 2019లో రూ.5,000 కోట్ల పెట్టుబడికి అంగీకరించారు.

ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో భారతదేశంలోని వివిధ నగరాల్లో లులు మాల్‌ను ప్రారంభించడం గురించి మాట్లాడారు. లులు మాల్ 2022లో లక్నోలో ప్రారంభించారు. లులు మాల్ కేరళలోని కొచ్చి, తిలువనంతపురం, త్రిస్సూర్, హైదరాబాద్‌లలో కూడా ఉంది. ఇది కాకుండా భారతదేశంలోని అనేక నగరాల్లో దీనిని ప్రారంభించే ప్రణాళికలు ఉన్నాయి.

Tv9 Witt Summit 4

యూసుఫ్ అలీ ఎవరు?

యూసుఫ్ అలీ ముస్లిం వీటిల్ అబ్దుల్ ఖాదర్ యూసుఫ్ ఒక భారతీయ వ్యాపారవేత్త, బిలియనీర్. ఆయన లులు గ్రూప్ ఇంటర్నేషనల్‌కు ఛైర్మన్. ఇది ప్రపంచవ్యాప్తంగా లులు హైపర్ మార్కెట్, లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ను కలిగి ఉంది. అతని వ్యాపారం ప్రపంచంలోని 22 దేశాలలో విస్తరించి ఉంది. అతని కంపెనీలో పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు పనిచేస్తున్నారు. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకారం.. యూసుఫ్ అలీ 2018లో అరబ్ ప్రపంచంలో టాప్ 100 భారతీయ వ్యాపార యజమానులలో నంబర్ 1 స్థానంలో నిలిచారు. అక్టోబర్ 2023లో ప్రచురించిన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అతను US$6.9 బిలియన్ల నికర విలువతో 27వ అత్యంత ధనవంతుడైన భారతీయుడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి