శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని సూర్య వైన్స్లో వినూత్న చోరీ జరిగింది. దొంగ వాచ్మెన్ పడుకున్నట్లు రాళ్లను బ్లాంకెట్తో కప్పి సెటప్ చేసి షట్టర్ పగలగొట్టి లోపల దూరాడు. నగదు, మద్యం సీసాలు అపహరించి, అదే పద్ధతిలో రాళ్లను కప్పి పారిపోయాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.