AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పహల్గామ్ దాడి దర్యాప్తుతో పాకిస్థాన్‌కు చుక్కలు.. అమిత్ షా మాస్ వార్నింగ్..

హోంమంత్రి అమిత్ షా ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రకటించారు. దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాద మూలాలను దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, నేరగాళ్ల డిజిటల్ డేటాబేస్, రాష్ట్రాల సమన్వయం వంటి కీలక చర్యలను వెల్లడించారు. భారతదేశాన్ని ఉగ్రవాద రహితంగా మార్చడమే లక్ష్యమని నొక్కి చెప్పారు.

పహల్గామ్ దాడి దర్యాప్తుతో పాకిస్థాన్‌కు చుక్కలు.. అమిత్ షా మాస్ వార్నింగ్..
Home Minister Amit Shah
Krishna S
|

Updated on: Dec 26, 2025 | 9:16 PM

Share

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని, దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. ఉగ్రవాద మూలాలను దెబ్బతీసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. గత ఏప్రిల్‌లో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత దర్యాప్తు సంస్థలు చేసిన విచారణ, పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ మాస్టర్ మైండ్‌లకు ఒక హెచ్చరికలా మారిందని షా అన్నారు. ఈ దాడికి పాకిస్థాన్ మద్దతు ఉందని భారత్ గట్టిగా వాదించగా ఆ దేశం ఖండించింది. కానీ మన భద్రతా దళాలు జరిపిన లోతైన దర్యాప్తు మన దేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయని ఆయన కొనియాడారు.

భద్రత కోసం కొత్త అస్త్రాలు

ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు అమిత్ షా కొన్ని కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఉగ్రవాదులు, నేరస్థుల పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక డిజిటల్ డేటాబేస్ రూపొందించారు. దీనివల్ల నేరస్థులను పట్టుకోవడం పోలీసులకు సులభం కానుంది. కేవలం ఉగ్రవాదులనే కాకుండా వారికి సహాయం చేసే వ్యవస్థీకృత నేరగాళ్లపై కూడా అన్ని వైపుల నుండి దాడులు చేసేలా కొత్త ప్రణాళికను తీసుకువస్తున్నారు. నేరాలను ఎలా దర్యాప్తు చేయాలో సూచించే NIA క్రైమ్ మాన్యువల్‌ను కూడా ఆయన విడుదల చేశారు.

రాష్ట్రాల మధ్య సమన్వయం

పోలీసులు, నిఘా సంస్థలు, వివిధ రాష్ట్రాల భద్రతా దళాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోవాలని షా సూచించారు. అందరూ కలిసి పని చేసినప్పుడే దేశాన్ని ఉగ్రవాదం నుండి రక్షించగలమని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లిలో వింత రూల్‌..డబ్బులు ఇస్తేనే భోజనం కూపన్!హాల్లోనే ఏటీఎంలు
పెళ్లిలో వింత రూల్‌..డబ్బులు ఇస్తేనే భోజనం కూపన్!హాల్లోనే ఏటీఎంలు
రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
రూ. 1 లక్షను రూ. 87 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ స్టాక్..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం