అందాల రకుల్ ప్రీత్ ఇక  టాలీవుడ్ కు దూరమైనట్టేనా..? 

26 December 2025

Pic credit - Instagram

Rajeev 

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు సినిమా ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. 

టాలీవుడ్ లో తోప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్.. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల సరసన నటించింది. 

రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 

తెలుగులో పూర్తిగా ఈ అమ్మడు సినిమాలను తగ్గించేసింది. దాంతో బాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.