వయస్సును వెనక్కినెట్టే జ్యూస్ ఇది.. రోజూ గ్లాసుడు తాగితే నిత్య యవ్వనమే!
26 December 2025
TV9 Telugu
TV9 Telugu
నారింజ రంగులో ఆకర్షణీయంగా కనిపించే క్యారెట్లు రుచికి తియ్యగా ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలు కూడా తయారు చేసుకోవచ్చు. రుచికే కాదు క్యారెట్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది
TV9 Telugu
వీటిల్లో బీటా కెరోటీన్ ఫైబర్, విటమిన్ కె1, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు సైతం దండిగా ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే ప్రాణాంతకమైన క్యాన్సర్ ముప్పు తప్పుతుంది
TV9 Telugu
కొవ్వు, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అన్ని వయసుల వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. బీటా కెరోటీన్ మన శరీరంలోకి ప్రవేశించిన తరువాత విటమిన్ ఎ మారి కంటి ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది
TV9 Telugu
క్యారెట్లు జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల దృష్టి లోపాలు తగ్గుతాయి. క్యారెట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది
TV9 Telugu
ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇందులోని పొటాషియం, విటమిన్ కె వంటి పోషకాలు రక్తపోటును తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి
TV9 Telugu
క్యారెట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వృద్దాప్య ఛాయలు తగ్గేలా చేస్తాయి. చర్మంపై మొటిమలు, మచ్చలు వంటి వాటిని నివారిస్తాయి
క్యారెట్ జ్యూస్ వల్ల కాలేయంలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. మెదడు చురుకుగా పని చేస్తుంది. దంతాలు, చిగుళ్ల సమస్య తొలగించి దంతాలను దృఢంగా చేస్తాయి