Telangana: కొత్తగా రేషన్ కార్డులు, పెన్షన్లు అప్లై చేసుకున్నవారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్
కొత్తగా రేషన్ కార్డుల కోసం, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోజుల వ్యవధిలోనే అర్హులైవవారికి వాటిని మంజూరు చేయబోతున్నట్లు తెలిపింది.
నారాయణఖేడ్(Narayankhed) రూపు రేఖలు పూర్తిగా మారాయని తెలంగాణ మినిస్టర్ హరీశ్ రావ్(Thaneeru Harish Rao) అన్నారు. నాణ్యతతో కూడుకున్న పనులు చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కొత్తగా రేషన్ కార్డులకు, పెన్షన్లకు అప్లై చేసుకున్నవారికి మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. ఆగష్టు నెలలో అర్హులైవవారికి వాటిని మంజూరు చేయబోతున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరికైనా సాంకేతిక సమస్యలు ఉండి దరఖాస్తు చేసుకున్న అర్హులకు కార్డులు రాకపోతే .. పున: సమీక్షించి వారికి కూడా 2 నెలల్లో కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకునే పేద వర్గాలకు ఆర్థిక తోడ్పాడు అందిస్తామన్నారు. గోదావరికి ఈ స్థాయి వరదలు వచ్చినా.. ముంపు ప్రాంతాల్లో ఒక్క ప్రాణం పోకుండా కాపాడుకున్నామని చెప్పారు. బీజేపీ లీడర్స్ హైదరాబాద్(Hyderabad)లో ఉండి బురద రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ సంపద సృష్టించి పేదలకు పంచుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతోందని హరీశ్‌రావు ఫైరయ్యారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? కళ్యాణ లక్ష్మి ఉందా..? అని హరీశ్ రావ్ సూటిగా ప్రశ్నించారు. BJP మాటలు వింటే ఆగం అవుతాం.. కాంగ్రెస్ మాటలు వింటే మోసపోతాం అని మంత్రి ప్రజలకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..