Kishan Reddy: ఆ ఆస్పత్రికి అనువైన భూమి కేటాయించండి.. సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Telangana:రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని సీఎం కేసీఆర్ (CM KCR) కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy). రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్న ప్రస్తుత భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని ఈ లేఖలో పేర్కొన్నారు.
Telangana:రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని సీఎం కేసీఆర్ (CM KCR) కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy). రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్న ప్రస్తుత భూమి ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తానన్న భూమిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను లేఖతోపాటు సీఎం కేసీఆర్‌కు పంపించారు కిషన్‌రెడ్డి. కాగా రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని గతంలోనే సీఎంకు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఈ నేపథ్యంలో రామగుండం శివారులో ఐదెకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూమి గురించి ESI అధికారులు, నిపుణులు సర్వే చేశారు. ఆ భూమిని గతంలో మున్సిపాల్టీ డంప్ యార్డ్‌గా వినియోగించారని ఆ సర్వేలో గుర్తించినట్లు పేర్కొన్నారు కిషన్‌రెడ్డి. పైగా ఆ భూమి పక్కనే రెండు శ్మశాన వాటికలు ఉన్నాయని, దానికి చేరుకోవడానికి నేరుగా దారి లేదని నిపుణుల నివేదికలో స్పష్టం చేశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
కాగా ప్రభుత్వం చూపిన స్థలానికి పార్కు మధ్య నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుందని, ఇది ఎంతో కష్టమని కేంద్రమంత్రి తెలిపారు. పైగా బస్టాండ్, రైల్వేస్టేషన్ నుంచి ఆ ప్రాంతం చాలా దూరమని లేఖలో రాశారు. కాబట్టి ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి, త్వరగా ఆస్పత్రి నిర్మాణానికి సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు కిషన్‌రెడ్డి. మరి కిషన్ రెడ్డి లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..