Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meena: భర్త మరణం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు మీనా.. రాజేంద్ర ప్రసాద్‌ బర్త్‌డే వేడుకలకు హాజరు..

Actress Meena: ప్రముఖ నటి మీనా ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆమె భర్త విద్యాసాగర్‌ కన్నుమూశారు. దీంతో ఆమె బాగా కుంగిపోయింది. చాలారోజుల వరకు ఇంటికే పరిమితమైపోయింది. అయితే తాజాగా మళ్లీ కెమెరా ముందుకొచ్చింది.

Meena: భర్త మరణం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు మీనా.. రాజేంద్ర ప్రసాద్‌ బర్త్‌డే వేడుకలకు హాజరు..
Actress Meena
Follow us
Basha Shek

|

Updated on: Jul 23, 2022 | 9:32 AM

Actress Meena: ప్రముఖ నటి మీనా ఇంట్లో ఇటీవల తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ఆమె భర్త విద్యాసాగర్‌ కన్నుమూశారు. దీంతో ఆమె బాగా కుంగిపోయింది. చాలారోజుల వరకు ఇంటికే పరిమితమైపోయింది. అయితే తాజాగా మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. అది కూడా ఓ తెలుగు సినిమా ద్వారా. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో బిగ్‌బాస్‌ ఫేమ్‌ సొహైల్‌ హీరోగా నటిస్తోన్న ఆర్గానిక్‌ మామ.. హైబ్రిడ్‌ అల్లుడు సినిమాలో మీనా కీలక పాత్ర పోషిస్తుంది. నటి కిరీటీ రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad) మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్‌లో ఇటీవల రాజేంద్ర ప్రసాద్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నటి మీనా (Meena) కూడా ఈ సెలబ్రేషన్స్‌లో భాగమైంది. అలాగే అలీ దంపతులు కూడా హాజరయ్యారు. కాగా ఈ వేడుకలను మొత్తం తన కెమెరాలో బంధించింది అలీ సతీమణి జుబేదా (Jubeda). అనంతరం ఆ వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఈ వీడియోతో మీనాతో జుబేదా సంభాషణలు హైలెట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది.

2

పరీక్షలు ఎగ్గొట్టి మరీ..

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా తన చిన్నతనంలో మీనాతో దిగిన ఫొటోను పంచుకుంది జుబేదా. ‘మీనా మనమిద్దరం ఎప్పుడు కలిశామో తెలుసా’ అంటూ పెళ్లాం చెబితే వినాలి సినిమా షూటింగ్‌ సమయంలో ఇద్దరు కలిసి దిగిన ఫొటోను చూపించింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి తాను 7వ తరగతి పరీక్షలు మరీ ఎగ్గొట్టి.. మీనాను కలిసేందుకు వచ్చానంటూ అప్పటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది జుబేదా. కాగా సన్‌ ఆఫ్‌ ఇండియా సినిమాలో చివరిసారిగా కనిపించింది నటి మీనా. అంతకుముందు బ్రోడాడీ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్స్‌ మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ సుకుమార్‌లతో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..