Hero Balakrishna: అభిమాని ఫ్యామిలీతో భోజనం చేసిన బాలయ్య.. అభిమానులను అభిమానించే ఏకైక హీరో అంటూ ఫ్యాన్స్ హర్షం

సినిమా షూటింగ్ నిమిత్తం కర్నూలు జిల్లా వెళ్లిన బాలకృష్ణ స్వయంగా అభిమానికి ఫోన్ చేశారు. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ కు బాలయ్య బాబు ఫోన్ చేశారు.

Hero Balakrishna: అభిమాని ఫ్యామిలీతో భోజనం చేసిన బాలయ్య.. అభిమానులను అభిమానించే ఏకైక హీరో అంటూ ఫ్యాన్స్ హర్షం
Balakrishna With Fan Family
Follow us
Surya Kala

|

Updated on: Jul 26, 2022 | 8:01 AM

Hero Balakrishna: టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో హిందూపురం (Hindupur) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఒక సామాన్య అభిమానిని గుర్తుపెట్టుకున్న నందమూరి బాలకృష్ణ .. ఆయన్ని ఫోన్ చేసి మరీ తన దగ్గరకు పిలిపించుకున్నారు. అభిమాని కుటుంబంతో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. దీంతో బాలయ్య ఫాన్స్ మా బాలయ్యబాబు మంచి మనుసున్న మహారాజు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

సినిమా షూటింగ్ నిమిత్తం కర్నూలు జిల్లా వెళ్లిన బాలకృష్ణ స్వయంగా అభిమానికి ఫోన్ చేశారు. ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు N.సజ్జాద్ హుస్సేన్ కు బాలయ్య బాబు ఫోన్ చేశారు. కర్నూలుకు కుటుంబంతో సహా రావాల్సిందిగా సజ్జాద్ హుస్సేన్ ఆదేశించారు. తన దగ్గరకు వచ్చిన అభిమాని కుటుంబానితో కలిసి బాలకృష్ణ భోజనం చేశారు. తమ అభిమాన హీరో బాలయ్యతో కలిసి కొంతసేపు గడపడం.. భోజనం చేయడంతో సజ్జాద్ హుస్సేన్ ఫ్యామిలీ సభ్యులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

ఈ సందర్బంగా సజ్జాద్ హుస్సేన్ మాట్లాడుతూ.. సామాన్యమైన వ్యక్తులు అయినా మాలాంటి వారితో బాలయ్య బాబు కలిసి భోజనము చేయడం సంతోషంగా ఉందని.. ఇది అయన గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. అంతేకాదు అభిమానులను అభిమానించే ఏకైక నటుడు ఒక్క బాలకృష్ణ  మాత్రమే అని కొనియాడారు. తమకు బాలయ్యబాబు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని.. దీనిని జీవితంలో మరిచిపోమంటూ అభిమాని కుటుంబం అంతా ఆనందం వ్యక్తం చేసారు.

ఇవి కూడా చదవండి

అఖండ సూపర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా షూటింగ్ తో బాలకృష్ణ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని కొండారెడ్డి బురుజు దగ్గర షూటింగ్ జరుపుకుంటుంది.

Reporter: Nagi Reddy , TV9 Telugu

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..