Mithali Raj: రీ ఎంట్రీపై మిథాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అవసరమైతే మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ..

Mithali Raj: భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ (Mithali Raj) మళ్లీ మైదానంలోకి దిగనుందా? తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కు తగ్గాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఐసీసీ హండ్రెడ్‌ పర్సెంట్ క్రికెట్‌..

Mithali Raj: రీ ఎంట్రీపై మిథాలి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అవసరమైతే మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ..
Mithali Raj
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2022 | 10:02 PM

Mithali Raj: భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ (Mithali Raj) మళ్లీ మైదానంలోకి దిగనుందా? తన రిటైర్మెంట్ నిర్ణయంపై వెనక్కు తగ్గాలని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఐసీసీ హండ్రెడ్‌ పర్సెంట్ క్రికెట్‌ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆమె ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ తెలిపింది. వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ప్రారంభమైతే తప్పకుండా తాను మైదానంలోకి దిగుతానంటూ, ఇందుకోసం ఓ ఆప్షన్‌ను ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానంటూ చెప్పకనే చెప్పింది.

కాగా పురుషుల ఐపీఎల్‌ల్లాగే మహిళా క్రికెటర్ల ఐపీఎల్‌ నిర్వహణకు గత కొద్దికాలంగా భారీగానే కసరత్తులు చేస్తోంది బీసీసీఐ. వచ్చే ఏడాది ఎలాగైనా ఈ వుమెన్స్‌ ఐపీఎల్‌ను ప్రారంభిస్తామని ఇటీవలే బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా చెప్పుకొచ్చారు. దీంతో మహిళల ఐపీఎల్‌పై ఆశలు పెరుగుతున్నాయి. మొత్తం 6 జట్లలో ఈ మెగాలీగ్‌ నిర్వహించే అవకాశాలున్నాయని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మిథాలీరాజ్‌ జీవితకథతో ఇటీవలే శభాష్‌ మిథూ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాప్సీ లేడీ సచిన్‌ పాత్రలో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..