AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG 2022: బర్మింగ్‌హామ్ చేరుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తొలి పోరు.. పాక్‌తో మ్యాచ్‌ పైనే ఆసక్తి..

ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఈ వారం నుంచి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు అథ్లెటిక్స్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ సహా ఇతర జట్లు కూడా బర్మింగ్‌హామ్ చేరుకున్నాయి.

CWG 2022: బర్మింగ్‌హామ్ చేరుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తొలి పోరు.. పాక్‌తో మ్యాచ్‌ పైనే ఆసక్తి..
Commonwealth Games 2022 Indian Womens Cricket Team
Venkata Chari
|

Updated on: Jul 26, 2022 | 8:00 AM

Share

IND vs PAK T20, Commonwealth Games 2022: కామన్వెవెల్త్ గేమ్స్ జులై 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ గేమ్స్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చేరుకుంది. ఆదివారం అర్థరాత్రి బయల్దేరిన టీమిండియా సోమవారం రాత్రికి ఆలస్యంగా చేరుకుంది. కామన్వెల్త్‌లోనే టీమిండియా పాకిస్థాన్‌తో తలపడాల్సి ఉంది. క్రికెట్ జట్టుతో పాటు అథ్లెటిక్స్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్ సహా ఇతర జట్లు కూడా ఇంగ్లండ్ చేరుకున్నాయి. 24 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. గతంలో అంటే 1998లో కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ ఉండేంది. ఈసారి మహిళల క్రికెట్‌కు మాత్రమే అవకాశం లభించింది. ఇది మొదటిసారి. జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్న బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 72 దేశాల నుంచి 4,500 మంది అథ్లెట్లు పోటీపడనున్నారు.

ఆగస్టు 7న పతకాల కోసం పోటీలు..

ఇవి కూడా చదవండి

కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం భారత మహిళల క్రికెట్ జట్టు కూడా ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టోర్నమెంట్‌లో క్రికెట్ గేమ్‌ల మొదటి మ్యాచ్ జులై 29న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరుగుతాయి. ఆగస్టు 7న క్రికెట్‌కు సంబంధించి బంగారు, కాంస్య పతకాల మ్యాచ్‌లు జరుగుతాయి.

8 మహిళల జట్లు, రెండు గ్రూపులు..

ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో 8 మహిళా క్రికెట్ జట్లను చేర్చారు. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల నుంచి టాప్ 2 జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం ఇరు జట్ల మధ్య ఫైనల్‌లో స్వర్ణ పతక పోరు జరగనుంది.

గ్రూప్ A: భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్

గ్రూప్ B: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక

గ్రూప్ A

తేదీ మ్యాచ్ సమయం వేదిక
జులై 29, 2022 ఆస్ట్రేలియా vs భారత్ 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
జులై 29, 2022 పాకిస్థాన్ vs బార్బడోస్ 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
జులై 31, 2022 భారత్ vs పాకిస్థాన్ 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
జులై 31, 2022 బార్బడోస్ vs ఆస్ట్రేలియా 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 3, 2022 ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 3, 2022 ఇండియా vs బార్బడోస్ 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

గ్రూప్ బి

తేదీ మ్యాచ్ సమయం వేదిక
జులై 30, 2022 న్యూజిలాండ్ vs సౌతాఫ్రికా 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
జులై 30, 2022 ఇంగ్లండ్ vs శ్రీలంక 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 2, 2022 ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 2, 2022 శ్రీలంక vs న్యూజిలాండ్ 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 4, 2022 దక్షిణాఫ్రికా vs శ్రీలంక 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 4, 2022 ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

సెమీ-ఫైనల్ మరియు ఫైనల్

తేదీ మ్యాచ్ సమయం వేదిక
ఆగస్టు 6, 2022 1వ సెమీ ఫైనల్ 3:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 6, 2022 2వ సెమీఫైనల్ 10:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 7, 2022 కాంస్య పతక పోరు 2:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
ఆగస్టు 7, 2022 చివరి 9:30 PM ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్

కామన్వెల్త్ కోసం భారత మహిళల జట్టు..

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, ఎస్. మేఘన, తానియా భాటియా (కీపర్), యాస్తికా భాటియా (కీపర్), దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, జెమిమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ రాణా.

స్టాండ్‌బై: రిచా ఘోష్, పూనమ్ యాదవ్, సిమ్రాన్ దిల్ బహదూర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..