Commonwealth Games 2022: 88 ఏళ్ల కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ప్రస్థానం.. తొలి పతకం నుంచి గతేడాది రికార్డులు ఇవే..
ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ జులై 28 నుంచి ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానున్నాయి. భారత్ నుంచి మొత్తం 322 మంది సభ్యుల బృందం ఈ క్రీడల కోసం వెళ్లారు.
India at Commonwealth Games: మొదటి కామన్వెల్త్ క్రీడలు 1930 సంవత్సరంలో కెనడాలోని హామిల్టన్‌లో జరిగాయి. ఆ తర్వాత దీనిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్‌గా ప్రారంభించారు. ఈ మొదటి కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పాల్గొనలేదు. 1934లో భారతదేశం తొలిసారిగా ఈ క్రీడల్లో పాల్గొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఈ క్రీడల మహా కుంభ్‌లో భారత్ పాల్గొంటోంది. కామన్వెల్త్ క్రీడలు 2022 జులై 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన భారతదేశానికి చెందిన 10 చారిత్రక విషయాలను ఇప్పుడు చూద్దాం..
- భారతదేశం తన మొట్టమొదటి పతకాన్ని 1934 కామన్వెల్త్ క్రీడలలో సాధించింది. ఈ పతకాన్ని రెజ్లింగ్‌లో రషీద్ అన్వర్ అందించాడు.
- కామన్వెల్త్‌లో తొలి స్వర్ణం కోసం భారత్ పూర్తి 24 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. 1958లో కార్డిఫ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు చెందిన మిల్కా సింగ్ స్వర్ణం అందించాడు.
- కామన్వెల్త్ గేమ్స్ 1978లో భారత మహిళలు తొలిసారిగా పతకాలు సాధించారు. ఈ ఏడాది కెనడాలోని ఎడ్మంటన్‌లో అమీ ఘియా, కన్వాల్ ఠాకూర్ కాంస్య పతకాలు సాధించారు.
- భారతదేశం నుంచి స్వర్ణం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి రూప ఉన్నికృష్ణన్. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది.
- డిస్క్ త్రోయర్ కృష్ణ పునియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణాన్ని అందించాడు. కార్డిఫ్ కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా సింగ్ స్వర్ణం గెలిచిన 52 సంవత్సరాల తర్వాత 2010 ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ స్వర్ణం వచ్చింది.
- కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు రెండు సార్లు రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. సిడ్నీ 1938, వాంకోవర్ 1954లో భారత జట్టుకు ఒక్క పతకం కూడా దక్కలేదు.
- 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి అత్యధిక పతకాలు సాధించిన టాప్-5 దేశాల్లో భారత్ చేరింది.
- కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యంత విజయవంతమైన భారతీయ ఆటగాడు షూటర్ జస్పాల్ రానా. అతను ఇప్పటివరకు 15 కామన్వెల్త్ గేమ్స్ పతకాలను తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.
- న్యూఢిల్లీలో జరిగిన 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం 101 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ తొలిసారి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.
- కామన్వెల్త్ క్రీడల 88 ఏళ్ల చరిత్రలో భారత్ మొత్తం 503 పతకాలు సాధించింది.
ఇవి కూడా చదవండి