Post Office Scheme: ప్రతిరోజు రూ. 70 లు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 10 లక్షల బెనిఫిట్.. పోస్టాఫీస్‌లో ప్రత్యేక పథకం..

ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ కంపెనీ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, CAలు, న్యాయవాదులు లేదా బ్యాంకర్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఉద్యోగులు ఈ ప్లాన్‌ని తీసుకునేందుకు అర్హులు. 21 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

Post Office Scheme: ప్రతిరోజు రూ. 70 లు ఇన్వెస్ట్ చేస్తే.. రూ. 10 లక్షల బెనిఫిట్.. పోస్టాఫీస్‌లో  ప్రత్యేక పథకం..
Post Officepost Office Scheme
Follow us
Venkata Chari

|

Updated on: Jul 24, 2022 | 9:15 PM

పోస్టాఫీసు ప్రజల కోసం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద వచ్చే ఈ ప్లాన్ పేరు యుగల్ సురక్ష. ఈ ప్లాన్‌లో, మీరు ప్రతి నెలా రూ. 2201 అంటే రోజుకు దాదాపు 70 రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా రూ. 10 లక్షల కంటే ఎక్కువ మెచ్యూరిటీని పొందవచ్చు. భార్యాభర్తలకు కలిసి కవరేజీ ఇచ్చే ప్లాన్ ఇది. అంటే భార్యాభర్తలిద్దరూ ఒకే ప్లాన్‌లో కవర్ అవుతారు. పాలసీ సమయంలో ఇద్దరూ జీవిత బీమా ప్రయోజనం పొందుతారు. యుగల్ సురక్ష అని పిలిచే ఈ పాలసీలో, మెచ్యూరిటీపై మొత్తం హామీ, బోనస్ అందిస్తారు.

పాలసీ సమయంలో జీవిత భాగస్వాముల్లో ఒకరు మరణిస్తే, బీమా మొత్తం, బోనస్‌తో కలిపి భాగస్వామికి మరణ ప్రయోజనం అందిస్తారు. ప్రతి ఒక్కరూ ఈ పాలసీని తీసుకోలేరు. కానీ, చాలా మంది ప్రజలు దీనిని తీసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సెమీ ప్రభుత్వ ఉద్యోగులు, లిస్టెడ్ కంపెనీ ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, CAలు, న్యాయవాదులు లేదా బ్యాంకర్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల ఉద్యోగులు ఈ ప్లాన్‌ని తీసుకోవచ్చు. 21 నుంచి 45 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

సరళమైన భాషలో అర్థం చేసుకుందాం..

ఇవి కూడా చదవండి

ఈ విధానం గురించి ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. రమేష్ (35), అతని భార్య (32) రూ. 5,00,000 హామీతో పోస్టాఫీసు ఈ పాలసీని తీసుకున్నారు. రమేష్ 20 ఏళ్ల ప్రీమియం తీసుకున్న పాలసీలో ప్రతి నెలా రూ.2201 చెల్లించాల్సి ఉంటుంది. రమేష్ వార్షిక ప్రీమియం చెల్లించాలంటే రూ.26,417 చెల్లించాలి. ఈ విధంగా 20 ఏళ్ల పాలసీ సమయంలో రమేష్ రూ.5,28,922 చెల్లిస్తారు. పాలసీ 20 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ పాలసీ మెచ్యూర్ అవుతుంది.

మెచ్యూరిటీ అయిన తర్వాత, రమేష్‌కి ఇలా మొత్తం అందుతుంది. ముందుగా రూ. 5,00,000 హామీ మొత్తంతోపాటు రూ. 5,20,000 బోనస్ అందుతుంది. ఈ విధంగా రమేష్ కు మొత్తం రూ.10,20,000 వస్తుంది. ఈ విధంగా రమేష్ 20 ఏళ్ల పాలసీలో మొత్తం రూ.5,28,922 చెల్లించగా, మెచ్యూరిటీపై రెట్టింపు ప్రయోజనం పొందాడు. దీంతో పాటు రమేష్ దంపతులకు జీవిత బీమా ప్రయోజనం కూడా లభించింది.

ఏదైనా జరిగితే..

పాలసీ వ్యవధిలో రమేష్ లేదా అతని భార్య దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఇతర జీవిత భాగస్వామి మరణ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో, 5 లక్షల సమ్ అష్యూర్డ్, దానితో పాటు చేసిన బోనస్ మొత్తం అందిస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరిలో ఎవరైనా చనిపోయారని అనుకుందాం. ఆ తర్వాత మరొక జీవిత భాగస్వామికి 5 లక్షల సమ్ అష్యూర్డ్, బోనస్ రూ. 1,30,000లను సంవత్సరానికి 26,000 చొప్పున 5 సంవత్సరాల వరకు అందిస్తారు. ఈ విధంగా, 5 సంవత్సరాల తర్వాత మరణ ప్రయోజనంగా 6,30,000 రూపాయలు అందుకుంటారు.