AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ప్రతిరోజూ ఈ డ్రింక్ తప్పక తాగాల్సిందే..

Health Tips: బెల్లీ ఫ్యాట్‌ను విసెరల్ ఫ్యాట్ అంటారు. పెరిగిన పొట్టను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గడం లేదు. పరిశోధన ప్రకారం, రోజూ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది.

Belly Fat: బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే.. ప్రతిరోజూ ఈ డ్రింక్ తప్పక తాగాల్సిందే..
Belly Fat
Venkata Chari
|

Updated on: Jul 23, 2022 | 9:25 PM

Share

నిశ్చలమైన జీవనశైలి, తక్కువ శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లలో తేడాల వల్ల ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావం ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. బరువు పెరగడం, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నీ మనిషిని చాలా బలహీనంగా మారుస్తాయి. అయితే, బరువు పెరగడం వల్ల నేటి కాలంలో చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నారు. చాలా మంది తమ బొడ్డు కొవ్వుతో అంటే బెల్లీ ఫ్యాట్‌తో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే బెల్లీ ఫ్యాట్ వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇటీవలి పరిశోధన ప్రకారం, ఎవరైనా ఒక నిర్దిష్ట పానీయం రోజూ తాగితే, అది పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు కూడా బొడ్డు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే, ఈ ప్రత్యేక పానీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బెల్లీ ఫ్యాట్..

బెల్లీ ఫ్యాట్‌ని విసెరల్ ఫ్యాట్ అని కూడా అంటారు. ఈ కొవ్వు పొట్ట లైనింగ్ లోపల లోతుగా నిల్వ అవుతుంది. అధిక కొవ్వు కారణంగా, ఇది కాలేయం, పేగులతో సహా అనేక అవయవాల చుట్టూ వ్యాపిస్తుంది. దీని కారణంగా అనేక సమస్యలు రావడం ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ డ్రింక్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది..

ది మిర్రర్ ప్రకారం, బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడానికి సరైన ఆహారం, అదనపు చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం, సంతృప్త కొవ్వు ప్రధాన కారణాలు. కొన్ని విషయాలు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. బొడ్డు కొవ్వును తగ్గించడానికి, బరువు తగ్గడానికి యాపిల్ సైడర్ వెనిగర్ తాగాలని కొన్ని పరిశోధనలు సిఫార్సు చేస్తున్నాయి.

నిజానికి, యాపిల్ సైడర్ వెనిగర్ అనేది AMPK ఎంజైమ్‌ను పెంచే యాసిడ్. ఈ ఎంజైమ్ కొవ్వును కరింగించడంలో సహాయపడుతుందని, చక్కెర ఉత్పత్తిని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన ప్రకారం, యాపిల్ సైడర్ వెనిగర్ మీకు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీరు తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది. బొడ్డు కొవ్వును కరిగించేందుకు సహాయపడుతుంది.

ఒక పరిశోధన ప్రకారం, అధిక కార్బోహైడ్రేట్ ఆహారంతో పాటు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా 200-275 తక్కువ కేలరీలు తింటారు. 175 మందిపై చేసిన ఈ పరిశోధన ప్రకారం రోజూ యాపిల్ సైడర్ వెనిగర్ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోయి బరువు కూడా తగ్గుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంత తీసుకోవాలి?

ఒక టీస్పూన్ వెనిగర్ తీసుకున్న వారు మూడు నెలల్లో 1.2 కిలోలు, రెండు చెంచాల వెనిగర్ తీసుకున్నవారు 1.7 కిలోలు తగ్గినట్లు పరిశోధనలో తేలింది. ప్రతిరోజూ ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం చాలా మందికి సురక్షితమైనదిగా పరిగణించారు. కొవ్వును కూడా తగ్గిస్తుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను సురక్షితంగా తాగాలంటే, దానిని నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. ఈ పద్ధతులు పాటించేముందు డాక్టర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.