Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone in toilet: టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..

కొంత మంది మరో అడుగుముందుకేసి ఫోన్‌తో టాయిలెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. ఈ అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అవేంటంటే..

Phone in toilet: టాయిలెట్‌లో సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి..
Phone In Toilet
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 24, 2022 | 11:00 AM

Using phone in toilet? Why you must stop this habit: స్మార్ట్‌ఫోన్ చేతిలోకొచ్చాక ప్రపంచమంతా స్మార్ట్‌ఫోన్‌కి బానిసైందంటే అతిశయోక్తి కాదేమో! నిద్ర లేవగానే ముందుగా మొబైల్ ఫోన్‌ను చూసుకునేంతగా.. అసలు ఫోన్‌ లేకపోతే రోజు గడవలేని స్థితికి వచ్చేంశాం. ఒక రకంగా చెప్పాలంటే దాని గుప్పిట్లో మనల్ని బంధించేసింది. మొబైల్ ఫోన్ చాలా ఉపయోగకరమైన పరికరమే! దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఐతే మొబైల్‌ ఫోన్‌ను కమ్యూనికేషన్‌కు మాత్రమే కాకుండా పాటలు, వీడియోలు, గేమ్స్‌.. ఇలా ఎన్నో ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకొచ్చాయి. తింటున్నా, నడుస్తున్నా, పడుకున్నా.. ఏ పని చేస్తున్నా చేతిలో ఫోన్‌ తప్పనిసరైపోయింది. ఐతే మరికొంత మంది మరో అడుగుముందుకేసి ఫోన్‌తో టాయిలెట్‌లోకి ప్రవేశిస్తుంటారు. ఈ అలవాటు వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చిరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

బయట ఎంత శుభ్రంగా ఉన్నా.. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత టాయిలెట్ శుభ్రతపై అంత శ్రద్ధ పెట్టరు. టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత రెండు చేతులను కనీసం నలభై సెకన్లపాటైనా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతిలో ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరస్ ఉంటే అది పూర్తిగా తొలగిపోతుంది. టాయిలెట్‌కి వెళ్లిన వ్యక్తి చేతిలో ఫోన్‌ ఉంటే రెండు చేతులు సరిగ్గా కడుక్కోలేకపోవడం మొదటి కారణం. ఆ తర్వాత సరిగ్గా శుభ్రం చేసుకోని ఆ చేత్తోనే తినటం జరుగుతుంది. ఫలితంగా హానికరమైన వైరస్‌లు, బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశిస్తాయి. ఇది అతిసారం, జీర్ణ సమస్యలు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది. ఈ భయంకరమైన సమస్యలు మన దైనందిన జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి.

టాయిలెట్‌ సీట్‌పై ఎక్కువ సేపు మొబైల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటే మలద్వారంతోపాటు అంతర్గత అవయవాలపై అదనపు ఒత్తిడి పడి పైల్స్ సమస్యలకు దారి తీస్తుంది.

టాయిలెట్లలో భయంకరమైన బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది. టాయిలెట్‌లోకి మొబైల్ ఫోన్‌తో వెళ్తే ఆ బ్యాక్టీరియా మొబైల్ ఫోన్‌కు కూడా అంటుకుంటుంది. చేతుల ద్వారా ఆ బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

ఇలా చేశారంటే.. మొబైల్ ఫోన్‌తో టాయిలెట్‌లోకి వెళ్లే అలవాటును మానుకోవాలి. కానీ చాలామంది మలవిసర్జన చేయడానికి అధిక సమయం తీసుకుంటారు. దీంతో వారు మొబైల్ ఫోన్లతో టాయిలెట్‌లో కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు టాయిలెట్లోకి ప్రవేశించే ముందు కొంత సమయం వ్యాయామం చేయాలి. రాత్రి, ఉదయం చిటికెడు వాము తిన్నా బాగా పనిచేస్తుంది. ఈ రెండు పద్ధతులు పాటిస్తే త్వరగా స్టమక్‌ క్లియర్ అవుతుంది. టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చోవాల్సిన అవసరం కూడా ఉందడు. చాలా మంది టాయిలెట్‌లో కూర్చుని ఆఫీసు పనులు కూడా చేస్తుంటారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే టాయిలెట్ లోపల స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించకుండా నిరోధించవచ్చు. తత్ఫలితంగా మీ ఆరోగ్యం మరెంతో పదిలంగా ఉంటుంది.

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ