Neem Benefits: వేప ఆకులతో ఇలా చేశారంటే.. జుట్టు సమస్యలన్నీ పరార్!
మన దేశ వైద్య చరిత్రలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది. వేప అద్భుతమైన దివ్యౌషధం. వేప చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు..
Neem Health Benefits in telugu: మన దేశ వైద్య చరిత్రలో వేపకున్న విశిష్టత ప్రత్యేకమైనది. వేప అద్భుతమైన దివ్యౌషధం. వేప చెట్టులోని ప్రతి భాగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అంటే ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు, పండ్లు లేదా పూలు ఇవన్నీ ఆయుర్వేద చికిత్సా విధానంలో విరివిగా వాడతారు. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడానికి, చర్మం, నోటి ఆరోగ్యం, జీర్ణక్రియ.. ఆరోగ్యాలను మెరుగుపరచడంలో వేప ఎంతో ఉపయోగపడుతుంది. వేప వేరు, కాండం, ఆకులు, బెల్లం, గింజలు, నూనె వంటివి వివిధ వ్యాధుల నివారణలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎసిడిటీ , యూరిన్, చర్మ వ్యాధుల నివారణకు ఇంటి పెరట్లో దొరికే వేప చెట్టు చేసే మేలు అంతా ఇంతాకాదు. ఆయుర్వేదం ప్రకారం గర్భిణీ స్త్రీలు, పిల్లలు వేపను తీసుకోకూడదు.
వేప – ఆరోగ్య ప్రయోజనాలు
- జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
- అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది
- దగ్గు, దాహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- గాయాలను శుభ్రపరుస్తుంది, నయం చేస్తుంది.
- వికారం, వాంతుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
- వాపు తగ్గించడంలో సహాయపడుతుంది.
వేపను ఎలా ఉపయోగించవచ్చు?
ఇవి కూడా చదవండి
- వేప పొడిని నీరు లేదా తేనెతో కలిపి పేస్ట్‌లా చేసి చర్మం లేదా గాయాలపై పూత పూయవచ్చు.
- వేప పొడి/వేప ఆకులను వేడి నీళ్లలో వేసి మరగ పెట్టి స్నానం చేస్తే, చర్మ సమస్యలు పరారవుతాయి.
- వేప ఆకులను నీళ్లలో మరిగించి, ఆ నీళ్లు చల్లారిన తర్వాత జుట్టుకు వాడితే చుండ్రు సమస్య దూరం అవుతుంది.
- వేప నీటి కషాయాన్ని హెర్బల్ టీగా తాగవచ్చు.
- మొటిమల నివారణకు వేప పొడిని గంధం, గులాబి, పసుపు, మంజిష్ట వంటి మూలికలతో కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లా వేసుకోవచ్చు.
- రోజూ పరగడుపున 7-8 వేప ఆకులను 2 వారాల పాటు తింటే రక్తం శుద్ధి అవుతుంది.
- పళ్లు తోముకోవడానికి వేప పుల్లలను ఉపయోగించవచ్చు.
- మధుమేహం, చర్మ సమస్యలు, రోగనిరోధక శక్తి, జ్వరం మొదలైన వాటికి వేప ఏ రూపంలోనైనా (పొడి, రసం) తీసుకోవచ్చు.