- Telugu News Photo Gallery Bollywood Actress Alia bhatt beauty tips try these beauty tips if you want glowing skin like ranbir kapoors wife in Telugu
Alia Bhatt: అలియా లాగా అందంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ సింపుల్ బ్యూటీ టిప్స్ మీ కోసమే
Alia Bhatt Beauty Tips: తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అలియాభట్. సిల్వర్ స్ర్కీన్‌పైనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో అందంగా కనిస్తుంటుందీ ముద్దుగుమ్మ. మరి ఈ ముద్దుగుమ్మ అందం వెనకనున్న రహస్యమేమిటో తెలుసుకుందాం
Updated on: Jul 23, 2022 | 1:52 PM

తనదైన అందం, అభినయంతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది అలియాభట్. సిల్వర్ స్ర్కీన్‌పైనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఎంతో అందంగా కనిస్తుంటుందీ ముద్దుగుమ్మ. మరి ఈ ముద్దుగుమ్మ అందం వెనకనున్న రహస్యమేమిటో తెలుసుకుందాం.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న అలియా తన చర్మ సంరక్షణ కోసం షీట్ మాస్క్ ధరిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా సార్లు ఫేస్‌మాస్క్ తో కూడిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ షీట్ మాస్క్‌లు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. 15 రోజులకు ఒకసారి ఈ చిట్కాను పాటిస్తే మంచిది.

జిమ్‌లో వ్యాయామంతో పాటు, అలియా తన ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటుంది. వాటికి బదులుగా పండ్లు, కూరగాయలతో కూడిన హెల్దీ డైట్ తీసుకుంటుంది.

ఫేస్ ప్యాక్: ఒక గిన్నెలో తేనె, బొప్పాయి, నిమ్మరసం కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖంపై అప్లై చేసి కాసేపు ఆరనివ్వాలి. కొద్దిసేపటి తర్వాత రోజ్ వాటర్ తో ముఖంపై మసాజ్ చేయాలి. ఆపై చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఈ ప్యాక్‌ని నెలకు మూడుసార్లు అప్లై చేస్తే ముఖం మెరిసిపోతుంది.

హైడ్రేషన్ : స్కిన్ కేర్ లో ఎన్ని ఖరీదైన వస్తువులు వాడినా చర్మం హైడ్రేషన్ కాకపోతే మాత్రం పలు సమస్యలు తప్పవు. చర్మం హైడ్రేట్ గా ఉండాలంటే నీళ్లు బాగా తాగాలి. రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.





























