- Telugu News Photo Gallery Team India set a special record: Shikhar Dhawan is India's 7th captain in 2022 Cricket News in Telugu
IND vs WI 1st ODI: 7 నెలల్లో ఏడుగురు కెప్టెన్లు.. శ్రీలంక రికార్డు తిరగరాసిన టీం ఇండియా జట్టు!
టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సిరీస్ నుంచి సిరీస్‌కు మారుతూనే ఉంది. గత 7 నెలల్లో ఏడుగురు కెప్టెన్లు టీమిండియాను నడిపించడమే అందుకు కారణం. అంటే ఒకే ఏడాదిలో ఏడుగురు కెప్టన్లు మారారరన్నమాట..
Updated on: Jul 23, 2022 | 2:50 PM

India vs West Indies: టీమ్ ఇండియా కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం సిరీస్ నుంచి సిరీస్‌కు మారుతూనే ఉంది. గత 7 నెలల్లో ఏడుగురు కెప్టెన్లు టీమిండియాను నడిపించడమే అందుకు కారణం. అంటే ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఏడుగురు కెప్టన్లు మారారరన్నమాట. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి ఈ ఏడాది టీమ్‌ఇండియాను నడిపించిన ఏడో కెప్టెన్‌గా శిఖర్ ధావన్ నిలిచాడు.

క్రికెట్ చరిత్రలో ఒక్క ఏడాదిలోనే టీమ్ ఇండియాకు ఏడుగురు కెప్టెన్లను రంగంలోకి దించి.. బీసీసీఐ ప్రత్యేక రికార్డును లిఖించింది. అత్యధిక సార్లు కెప్టెన్‌లను మార్చిన జట్టుగా శ్రీలంక (2017) పేర ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది. అంతేకాకుండా ఒక ఏడాదిలో 6 మంది కెప్టెన్లను రంగంలోకి దించిన దేశాల్లో ఆస్ట్రేలియా (2021), జింబాబ్వే (2001), ఇంగ్లండ్ (2011) రికార్డులను టీమిండియా అధిగమించింది.1959లో తొలిపారిగా టీమ్ ఇండియా ఐదుగురు కెప్టెన్లను మార్చింది. ఇప్పుడు ఏకంగా ఏడుగురు కెప్టెన్లు రంగంలోకి దించి టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ ఏడాది టీమిండియా కెప్టెన్లుగా ఉన్నవారు వీరే.. విరాట్ కోహ్లీ (దక్షిణాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్)

కేఎల్ రాహుల్ (దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్)

రోహిత్ శర్మ (వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్)

రిషబ్ పంత్ (దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్)

హార్దిక్ పాండ్యా (T20I vs ఐర్లాండ్)

జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్)

శిఖర్ ధావన్ (ODI vs వెస్టిండీస్)




