IND Vs WI: 35 బంతులు.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్.. భారత నయా ఆల్ రౌండర్ దొరికేశాడుగా

Axar Patel: అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ కారణంగా, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.

IND Vs WI: 35 బంతులు.. 3 ఫోర్లు, 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్.. భారత నయా ఆల్ రౌండర్ దొరికేశాడుగా
Axar Patel
Follow us

|

Updated on: Jul 25, 2022 | 12:30 PM

Axar Patel: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 312 పరుగుల క్లిష్ట లక్ష్యాన్ని చేధించి విజయాన్ని నమోదు చేసుకుంది. 35 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన అక్షర్ పటేల్ భారత విజయంలో హీరోగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ తన ఇన్నింగ్స్ తనకు చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. అద్భుతమైన ఆటతీరుతో అక్షర్ పటేల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. క్లిష్ట సమయంలో వచ్చిన ఈ ఇన్నింగ్స్‌తో జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఐపీఎల్‌లోనూ ఇదే చేశాం’ అంటూ పేర్కొన్నాడు.

అక్షర్ పటేల్ తన విజయ రహస్యాన్ని కూడా బయటపెట్టాడు. మేం ప్రశాంతంగా ఉండి పరుగుల వేగాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఐదేళ్ల తర్వాత వన్డే మ్యాచ్‌ ఆడుతున్నాను. భవిష్యత్తులో కూడా జట్టు కోసం ఇలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు తన మనసులో మాటను బయటపెట్టాడు.

312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 79 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ మధ్య నాల్గవ వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ మ్యాచ్‌లో భారత్ తిరిగి పుంజుకునేందుకు ఈ ఇన్నింగ్స్ కీలకంగా మారింది. అక్షర్ పటేల్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచి, సిరీస్‌లో భారత్‌కు తిరుగులేని 2-0 ఆధిక్యాన్ని అందించాడు.

ఇవి కూడా చదవండి

జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్‌లకు క్రెడిట్ అందించాడు. ఈ ఆటగాళ్లు విజయంపై ఆశలు వదులుకోలేదని, అందుకే భారీ లక్ష్యాన్ని సాధించగలిగామని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ