AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సిరీస్ గెలిచిన ఆనందంలో చిందులేసిన భారత ఆటగాళ్లు.. నెట్టింట్లో వీడియో వైరల్..

భారత్ రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ సిరీస్ విజయం.

Watch Video: సిరీస్ గెలిచిన ఆనందంలో చిందులేసిన భారత ఆటగాళ్లు.. నెట్టింట్లో వీడియో వైరల్..
Ind Vs Wi Celebration Video
Venkata Chari
|

Updated on: Jul 25, 2022 | 1:55 PM

Share

IND vs WI 2nd ODI: వెస్టిండీస్‌లో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో అప్‌లోడ్ అవ్వడంతో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను స్వయంగా టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ పోస్ట్ చేశాడు. ఇందులో వెస్టిండీస్ విజయంతో ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఆనందంతో కేకలు వేస్తున్నట్లు చూడొచ్చు.

ఈ పోస్ట్‌పై – టాలెంట్ గేమ్‌ను గెలుచుకుంది. కానీ, జట్టుకృషి, తెలివితేటలు ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాయి. అద్భుత విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు’ అంటూ క్యాఫ్షన్ అందించాడు. ఈ వీడియోకు 20 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. తన కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న షాయ్ హోప్ 115 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ నికోలస్ పూరన్ 74 పరుగులు చేశాడు. భారత్ తరపున శార్దూల్ ఠాకూర్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరపున అక్షర్ పటేల్ 64 పరుగులు చేశాడు. అదే సమయంలో, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ నుంచి 63 పరుగులు వచ్చాయి. సంజూ శాంసన్ తన వన్డే కెరీర్‌లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అతను 54 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

టీమ్ ఇండియా తిరుగులేని ఆధిక్యం..

భారత్ రెండో వన్డేలో విజయం సాధించడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. వన్డే క్రికెట్‌లో వెస్టిండీస్‌పై భారత్‌కు ఇది వరుసగా 12వ సిరీస్ విజయం.

ఈ విజయంతో ఒకే జట్టు చేతిలో వరుసగా అత్యధిక సిరీస్‌లను సాధించిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది. జింబాబ్వేపై పాక్ జట్టు వరుసగా 11 వన్డే సిరీస్‌లలో విజయం సాధించింది.

ఈ నెలలో ఇంగ్లండ్‌ను 2-1తో ఓడించిన టీమిండియా..

ఇంగ్లండ్ టూర్ నుంచి నేరుగా వెస్టిండీస్‌కు చేరుకుంది. వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ను 2-1తో ఓడించింది. అంతకు ముందు ఫిబ్రవరి నెలలో ఆ జట్టు వెస్టిండీస్‌ను 3-0తో ఓడించింది.

జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?