Virat Kohli: కింగ్‌ కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పమన్న నెటిజన్‌.. అక్తర్‌ ఆన్సర్‌ అదిరిపోయిందంతే..

Virat Kohli- Shoaib Akhtar: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన అతను ఇప్పుడు పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ మూడంకెల స్కోరు చేసి మూడేళ్లు..

Virat Kohli: కింగ్‌ కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పమన్న నెటిజన్‌.. అక్తర్‌ ఆన్సర్‌ అదిరిపోయిందంతే..
Virat Kohli Shoaib Akhtar
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2022 | 8:30 PM

Virat Kohli- Shoaib Akhtar: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. గతంలో పరుగుల వరద పారించిన అతను ఇప్పుడు పేలవ ఫామ్‌తో తంటాలు పడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ మూడంకెల స్కోరు చేసి మూడేళ్లు గడిచాయి. ఈక్రమంలో విరాట్‌ను జట్టు నుంచి తప్పించాలంటూ కొందరు మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో ఆడినా, ఆడకున్నా కోహ్లీ జట్టులోనే ఉండాలని, అతనొక గేమ్‌ ఛేంజర్‌ అంటూ మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఈక్రమంలో పాక్‌ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar) మన రన్‌మెషిన్‌ గురించి మరోసారి ఆసక్తికర వ్యా్‌ఖ్యలు చేశాడు.

అతను ఇప్పటికే లెజెండ్..

ఇవి కూడా చదవండి

కాగా తన జీవితంలోని ఎత్తు పల్లాలను సిల్వర్‌ స్ర్కీన్‌పై ఆవిష్కరించేలా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేరుతో తన బయోపిక్‌ను తీసుకురానున్నారు షోయబ్‌. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా తన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి మురిసిపోయాడీ స్పీడ్‌స్టర్‌. ఈ సందర్భంగా నెటిజన్లతో ముచ్చటించిన అతను తన పర్సనల్‌ లైఫ్‌, క్రికెట్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అదే సమయంలో ఫ్యాన్స్‌తో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ను కూడా నిర్వహించాడు. ఈ సందర్భంగా జయన్ ఖాన్ అనే ఓ నెటిజన్‌.. ‘విరాట్ కోహ్లీ గురించి ఒక్కమాటలో చెప్పమంటే ఏం చెబుతారు..?’ అని అడిగాడు. దీనికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు అక్తర్‌. అతను ఇప్పటికే లెజెండ్‌ అంటూ పాక్‌ స్పీడ్‌ స్టర్‌ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరలవుతోంది. ఇప్పుడే కాదు గతంలోనూ పలుసార్లు కోహ్లీకి సపోర్టుగా నిలిచారు అక్తర్‌. దిగ్గజ క్రికెటర్లు కూడా ఫామ్‌లేమితో తంటాలు పడ్డారని, ప్రస్తుతం కోహ్లీ కూడా అలాంటి ఇబ్బందులే పడుతున్నాడన్నాడు. ఒక్కసారి అతను ఫామ్‌ అందిపుచ్చుకుంటే ఎవరూ ఆపలేరంటూ వ్యాఖ్యానించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..