Megastar Chiranjeevi: కైకాలకు మెగాస్టార్‌ సర్‌ప్రైజ్‌.. బెడ్ పైనే కేక్‌ కట్‌ చేయించి బర్త్‌ డే విషెస్

Kaikala Satyanarayana Birthday: హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రకైనా జీవంపోసి నవరస నట సార్వభౌమగా గుర్తింపుతెచ్చుకున్నారు కైకాల సత్యనారాయణ. సుమారు 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఘనత ఆయన సొంతం. కాగా వృద్ధాప్య సమస్యలతో పాటు..

Megastar Chiranjeevi: కైకాలకు మెగాస్టార్‌ సర్‌ప్రైజ్‌.. బెడ్ పైనే కేక్‌ కట్‌ చేయించి బర్త్‌ డే విషెస్
Megastar Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Jul 25, 2022 | 5:34 PM

Kaikala Satyanarayana Birthday: హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రకైనా జీవంపోసి నవరస నట సార్వభౌమగా గుర్తింపుతెచ్చుకున్నారు కైకాల సత్యనారాయణ. సుమారు 700కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఘనత ఆయన సొంతం. కాగా వృద్ధాప్య సమస్యలతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో  కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. కాగా నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనుకు బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి కైకాలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి కేక్‌ కట్‌ చేయించి బర్త్‌డే విషెష్‌ తెలిపారు. అనంతరం ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు.

అనంతరం ఈ విషయాన్ని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘పెద్దలు కైకాల సత్యనారాయణగారి పుట్టినరోజున వారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. భగవంతుడు ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అందులో పేర్కొన్నారు. కాగా గతేడాది కూడా చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి కైకాల ఇంటికెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో గతేడాది చివర్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కైకాల. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని క్షేమంగా కోలుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..