MS Dhoni: మిస్టర్ కూల్‌కు భారీ షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. ఎందుకో తెలుసా?
Mahendra Singh Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి భారీ షాక్ తగిలింది. ఆమ్రపాలి గ్రూప్ కేసులో మిస్టర్‌కూల్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని వెంటనే నిలిపివేయాలని
Mahendra Singh Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి భారీ షాక్ తగిలింది. ఆమ్రపాలి గ్రూప్ కేసులో మిస్టర్‌కూల్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని వెంటనే నిలిపివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 9కి వాయిదా వేసింది. కాగా గతంలో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. అయితే ఆ సమయంలో తనకు రావాల్సిన 40 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఆమ్రపాలి కంపెనీ ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ 2019 మార్చిలో ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ధోనీ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆమ్రపాలి గ్రూప్‌పై మధ్యవర్తిత్వ ప్రక్రియను ప్రారంభించింది. ధోనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఆమ్రపాలి గ్రూప్ ‘షామ్ ఒప్పందాలు’ కుదుర్చుకుంది. ఇంటి కొనుగోలుదారుల సొమ్మును అక్రమంగా మళ్లించిందని అత్యున్నత న్యాయస్థానం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ధర్మాసనానికి తెలిపారు.
SC takes note of arbitration proceedings initiated by Delhi HC against Amrapali Group on MS Dhoni’s plea
మరోవైపు ఆమ్రపాలి కంపెనీ మాత్రం ధోనీ తమకు 42 కోట్ల రూపాయలు చెల్లించాలని వాదిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా జనవరి 2019లో నిలిచిపోయిన రెండు ఆమ్రపాలి హౌసింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ప్రక్రియను ప్రారంభించడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కాగా ఇటీవల తన పుట్టిన రోజును ఇంగ్లండ్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు ధోని. తన కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు.