AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 61 బంతుల్లో 109 రన్స్‌.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 18 ఏళ్ల వయసులోనే సెంచరీ.. అరుదైన రికార్డు ఖాతాలో

Gustav McKeon Century: గుస్తావ్‌ మెక్‌కీన్‌ (Gustav McKeon) అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టాడు. 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అఫ్గనిస్తాన్‌ ఆటగాడు హజ్రతుల్లా..

Cricket: 61 బంతుల్లో 109 రన్స్‌.. 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 18 ఏళ్ల వయసులోనే సెంచరీ.. అరుదైన రికార్డు ఖాతాలో
Gustav Mckeon
Basha Shek
|

Updated on: Jul 26, 2022 | 3:22 PM

Share

Gustav McKeon Century: అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్రాన్స్ జట్టు ఇంకా పసికూనే. ఇప్పుడిప్పుడే బుడి బుడి అడుగులు వేస్తోంది. అయితే ఆ జట్టు ఆటగాడు గుస్తావ్‌ మెక్‌కీన్‌ (Gustav McKeon) అప్పుడే రికార్డుల వేట మొదలుపెట్టాడు. 18 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు అఫ్గనిస్తాన్‌ ఆటగాడు హజ్రతుల్లా జజాయ్‌ (Hazratullah Zazai) పేరిట ఉందేడి. ఇతను 20 ఏళ్ల 337 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024 యూరప్‌ క్వాలిఫయర్‌ గ్రూప్‌ బి రౌండ్‌లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కీన్‌ ఈ రికార్డును బద్దలు కొట్టాడు.ఈ మ్యాచ్‌లో 61 బంతులు ఎదుర్కొన్న అతను 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు,9 సిక్స్‌లు ఉన్నాయి.

కాగా ఈ మ్యాచ్ లో మెక్‌కీన్‌ సెంచరీతో మెరిసినా ఫ్రాన్స్‌ జట్టు మాత్రం ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఫ్రాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. మెక్‌కీన్‌ 109 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్విట్జర్లాండ్‌ 9 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్‌ నజీర్‌ (67) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. చివరి 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా, ఆఖరి బంతికి బౌండరీ బాది స్విట్జర్లాండ్‌ విజయాన్ని ఖరారు చేశాడు. కాగా మెక్‌కీన్ ఈ టోర్నమెంట్లో చెలరేగుతున్నాడు. చెక్‌రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 54 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ టోర్నమెంట్‌లో అతను ఇప్పటివరకు 161 స్ట్రైక్ రేట్‌తో 185 పరుగులు సాధించాడు. సగటు 92.50గా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
భారత్ ఖనిజాల హబ్‌గా ఆ రాష్ట్రం? బంగారం కన్నా విలువైన నిధి లభ్యం!
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
ఈవీలు కొనండి.. క్యాష్ పొందండి.. ఉద్యోగులకు ఆ కంపెనీ బంపర్ ఆఫర్
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
భారత బిలియనీర్లు తమ డబ్బును ఎందులో పెట్టుబడి పెడ్తున్నారో తెలుసా?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
పాక్‌తోపాటు భారత్‌కు షాకిచ్చిన బంగ్లా.. ఫైనల్ ఆడేది ఆ 2 జట్లే?
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్
స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపించిన బిగ్‌ పైథాన్