Ramcharan: తర్వాతి జేమ్స్‌బాండ్‌ చెర్రీనే.. ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ క్రియేట‌ర్

RRR Movie: మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌(Junior NTR) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్లో బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, ఓలివియో మోరీస్‌ హీరోయిన్లుగా నటించగా ,,

Ramcharan: తర్వాతి జేమ్స్‌బాండ్‌ చెర్రీనే.. ప్రశంసలు కురిపించిన హాలీవుడ్ క్రియేట‌ర్
Ramcharan
Follow us
Basha Shek

|

Updated on: Jul 28, 2022 | 8:07 PM

RRR Movie: మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan), జూనియర్‌ ఎన్టీఆర్‌(Junior NTR) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR). దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్మెంట్లో బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, ఓలివియో మోరీస్‌ హీరోయిన్లుగా నటించగా అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియాశరణ్‌, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది మార్చి25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీల్లోనూ అడుగుపెట్టి రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. మే 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు వీక్షించారు. జేమ్స్ గన్, స్కాట్ డెరిక్సన్, రుస్సో బ్రదర్స్ వంటి టాప్‌ హాలీవుడ్ డైరెక్టర్స్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌ను వీక్షించారు. సినిమా అద్భుతంగా ఉందంటూ, విజువల్‌ వండర్‌లా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మార్వెల్స్‌ టీవీ సిరీస్‌ ల్యూక్‌ కేజ్‌ రైటర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ చెయో హోదారి కోకర్‌ (Cheo Hodari Coker) ఈ జాబితాలో చేరాడు.

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను వీక్షించిన ఆయన జేమ్స్ బాండ్‌ పాత్రకు రామ్‌చరణ్ సరిగ్గా సరిపోతాడంటూ మెచ్చుకున్నారు. ‘తర్వాతి జేమ్స్ బాండ్ ఎవరనగానే గ్యాంగ్స్ ఆఫ్ లండన్‌లో సోప్, ది ఆఫర్‌ లో మాథ్యూ, స్నోఫాల్ లో డ్యామ్‌సన్, ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ వెంటనే నా మదిలో మెదిలారు ‘ అంటూ చెయో సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట్లో వైరలవుతోంది. చెర్రీ అభిమానులందరూ తెగ సంతోషపడుతూ ఈ పోస్టును షేర్‌ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
ఆ విషయంలో మహిళల కంటే పురుషులే బెటర్.. తాజా రిపోర్ట్ ఇదే..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
అమ్మో.. వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.! వీడియో..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కొత్త టెన్నిస్ స్కూటర్.. మార్కెట్‌ను ఆడేసుకుంటుందా..?
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
కామధేను విగ్రహం పెట్టుకోవలనికి కూడా వాస్తు నియమాలున్నాయని తెలుసా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ మెగా వేలంతో ఉనికిని చాటుకోనున్న సౌదీ అరేబియా
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
సుమ ఇంతమందికి సహాయం చేసిందా? కన్నీళ్లు తెప్పిస్తోన్న వీడియో
వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?
వాటర్ బాటిల్ మూతల రంగు వేర్వేరుగా ఎందుకు ఉంటాయి? వాటి అర్థం ఏంటి?
రోడ్డంతా చేపల మయం.. పట్టుకునోళ్లకు పట్టుకున్నన్ని..!
రోడ్డంతా చేపల మయం.. పట్టుకునోళ్లకు పట్టుకున్నన్ని..!
ముగిసిన రెండో రోజు.. 200లు దాటిన భారత్ ఆధిక్యం
ముగిసిన రెండో రోజు.. 200లు దాటిన భారత్ ఆధిక్యం