Shreyas Iyer: సాహో శ్రేయస్‌.. గాల్లోకి ఎగిరి సిక్సర్‌ను అద్భుతంగా ఆపిన అయ్యర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో

IND vs WI: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. వన్డే సిరీస్‌ విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ టీమిండియా 68 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)..

Shreyas Iyer: సాహో శ్రేయస్‌.. గాల్లోకి ఎగిరి సిక్సర్‌ను అద్భుతంగా ఆపిన అయ్యర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో
Shreyas Iyer
Basha Shek

|

Jul 30, 2022 | 3:57 PM

IND vs WI: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం ట్రినిడాడ్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. వన్డే సిరీస్‌ విజయోత్సాహాన్ని కొనసాగిస్తూ టీమిండియా 68 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. అయితే ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) డకౌట్‌గా వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన అతను కేవలం 4 బంతులే ఎదుర్కొని మెక్‌కాయ్‌ బౌలింగ్‌లో అఖిల్‌ హొస్సెన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అయితే బ్యాటింగ్‌లో నిరాశపర్చిన శ్రేయస్‌ అద్భుతమైన ఫీల్డింగ్‌తో దాన్ని సరిదిద్దుకున్నాడు. కాగా భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకిఅడుగుపెట్టిన కెప్టెన్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) ఒక ఫోర్‌, సిక్సర్‌ బాది తన దూకుడు చూపించాడు. ఇదే ఊపులో స్పిన్‌ మాంత్రికుడు రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీషాట్‌కు ప్రయత్నించాడు. బంతి చాలా ఎత్తులో వెళ్లడంతో కామెంటేటర్లతో సహా అందరూ సిక్స్‌ అని భావించారు. అయితే అప్పుడే ఓ అద్భుతం చోటు చేసుకుంది. బౌండరీ లైన్‌ వద్ద కాచుకుని ఉన్న శ్రేయస్‌ అమాంతం గాల్లోకి ఎగిరి శరీరాన్ని విల్లులా మార్చుకుని ఒంటి చేత్తో బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే కాలు బౌండరీ లైన్‌కు సమీపంలో ఉండడంతో బ్యాలెన్స్‌ చేయలేకపోయాడు. దీంతో బంతిని మైదానంలోకి విసిరేసి బౌండరీలైన్‌లోకి వెళ్లిపోయాడు. అలా క్యాచ్‌ మిస్‌ అయినా సిక్స్‌ను తప్పించడంలో సక్సెస్‌ అయ్యాడీ యంగ్‌ ప్లేయర్‌. ఈ విషయంపై థర్డ్ అంపైర్ కూడా చాలాసార్లు రీప్లేలు చూసి అయ్యర్ ప్రయత్నంలో ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేసుకున్నాడు.

కాగా శ్రేయస్‌ సూపర్‌ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియోను ఫ్యాన్‌కోడ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రేయస్‌ సూపర్‌ ఫీల్డింగ్‌కు అభిమానులందరూ ఫిదా అవుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (64), దినేశ్‌ కార్తీక్‌ (41) పరుగుల చేయడంలో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కరేబియన్‌ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు నష్టపోయి కేవలం 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవి బిష్ణోయి, రవిచంద్రన్‌ అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లతో విండీస్‌ను కట్టడి చేయారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ సోమవారం (ఆగస్టు 1) న జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu