COMMONWEALTH GAMES 2022: కామన్వెల్త్ క్రీడల్లో ఆతిథ్య జట్టు బోణి కొట్టింది. పురుషుల ట్రయాథ్లాన్ విభాగంలో ఆ దేశానికి చెందిన అలెక్స్ యీ (Alex Yee) బంగారు పతకంతో మెరిశాడు. 24 ఏళ్ల అలెక్స్ ఈవెంట్‌లోని..
COMMONWEALTH GAMES 2022: కామన్వెల్త్ క్రీడల్లో ఆతిథ్య జట్టు బోణి కొట్టింది. పురుషుల ట్రయాథ్లాన్ విభాగంలో ఆ దేశానికి చెందిన అలెక్స్ యీ (Alex Yee) బంగారు పతకంతో మెరిశాడు. 24 ఏళ్ల అలెక్స్ ఈవెంట్‌లోని మూడు దశలను మొత్తం 50.34 నిమిషాల్లో పూర్తి చేసి స్వర్ణాన్ని ముద్దాడాడు. న్యూజిలాండ్‌కు చెందిన హేడెన్ వైల్డ్, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హౌసర్ వరుసగా 2,3 స్థానాల్లో నిలిచారు. కాగా కామన్వెల్త్ ట్రయాథ్లాన్ మూడు ఈవెంట్లు ఉంటాయి. 750 మీటర్లు ఈత కొట్టడం, తర్వాత 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం, చివరకు రన్నింగ్‌ఈవెంట్ ఉంటుంది. కాగా ఈ ఈవెంట్‌లో అలెక్స్‌కు శుభారంభం దక్కలేదు. స్విమ్మింగ్ స్టేజ్ తర్వాత 16వ స్థానంలో నిలిచాడు. ఆతర్వాత సైక్లింగ్‌లో రాణించి ఐదో స్థానానికి చేరుకున్నాడు. ఆతర్వాత రన్నింగ్ రేస్‌లో అథ్లెట్లందరినీ ఓడించి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. కాగా గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో త్రుటిలో గోల్డ్ మిస్సయ్యాడు అలెక్స్. అప్పుడు రజత పతకంతో సరిపెట్టుకున్న అతను ఈ ఈవెంట్లో మాత్రం ఆ లోటును భర్తీ చేసుకున్నాడు.
ఇక ఇదే ఈ వెంట్‌లో రజత పతకాన్ని న్యూజిలాండ్‌కు చెందిన హేడెన్ వైల్డ్ (50.47) గెల్చుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హౌసర్ (50.50) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఆదర్శ్ మురళీధరన్ (1.00.38 గంటలు) 30వ స్థానంలో, విశ్వనాథ్ యాదవ్ (1.02.52 గంటలు) 33వ స్థానంలో నిలిచి నిరాశపర్చారు.
A win for England at the Commonwealth Games!! Alex Yee places 1st in the men’s triathlon at Sutton Park this morning. YES ? pic.twitter.com/2WruE7AMvu