IND vs WI 1st T20: తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రోహిత్ సేన..

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

IND vs WI 1st T20: తొలి టీ-20లో వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం.. ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన రోహిత్ సేన..
Ind Vs Wi 1st T20i Highligh
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 30, 2022 | 5:38 AM

IND vs WI 1st T20I Highlights: రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలను సొంతం చేసుకుంటోంది. భారత క్రికెట్ జట్టు మరో సిరీస్‌ని అట్టహాసంగా ప్రారంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ 20లో టీం ఇండియా 68 పరుగులతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ (16 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. దినేశ్‌ కార్తీక్‌ (19 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ఇన్నింగ్స్‌ తో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ గా నిలిచాడు. జడేజా (16), రిషభ్‌ పంత్‌ (14) పరుగులు మాత్రమే చేయగలిగారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ (24/2), రవి బిష్ణోయ్ (26/2), అశ్విన్ 2 వికెట్లతో రాణించడంతో భారత్‌ వెస్టిండీస్‌పై భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో టి20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా బ్యాటింగ్ అనంతరం భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విండీస్‌ ప్లేయర్లు విలవిల్లాడారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేశారు. బ్రూక్స్‌ (20) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో గట్టి పోటీ ఇచ్చిన విండీస్ బ్యాట్స్‌మెన్లు ఈసారి దారుణంగా విఫలమయ్యారు. కాగా.. రెండో టి20 సోమవారం బసెటెర్‌లో జరుగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..