Relationship: లైంగిక వాంఛ తగ్గిందా? కారణం అదే కావచ్చు.. తాజా అధ్యయనంలో సరికొత్త విషయాలు..

కోవిడ్-19 నుంచి బయటపడిన వారు కూడా జుట్టు రాలడం, లైంగిక బలహీనతతో బాధపడే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలింది.

Relationship: లైంగిక వాంఛ తగ్గిందా? కారణం అదే కావచ్చు.. తాజా అధ్యయనంలో సరికొత్త విషయాలు..
Relationship
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2022 | 6:03 PM

Relationship: దీర్ఘకాల కోవిడ్-19 బాధితులు గతంలో అనుకున్నదానికంటే విస్తృతమైన లక్షణాలను అనుభవిస్తున్నట్లు తాజా వైద్య అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 నుంచి బయటపడిన వారు కూడా జుట్టు రాలడం, లైంగిక బలహీనతతో బాధపడే అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలింది. UKలోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, మూడు రకాల ప్రత్యేకమైన దీర్ఘకాల కోవిడ్ లక్షణాలను గుర్తించారు. వీటిలో శ్వాసకోశ లక్షణాలు, మానసిక ఆరోగ్యం, జ్ఞానానికి సంబంధించిన సమస్యలు, ఆపై విస్తృత శ్రేణి లక్షణాలు కనిపిస్తున్నట్లు వెల్లడైంది.

అత్యంత సాధారణ లక్షణాలు అనోస్మియా (వాసన కోల్పోవడం), శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, జ్వరం.. ఇతరమైనవి: స్మృతి (జ్ఞాపకాలను కోల్పోవడం), అప్రాక్సియా (తెలిసిన కదలికలు లేదా ఆదేశాలను నిర్వహించలేకపోవడం), ప్రేగు సమస్యలు, జుట్టు రాలడం, అంగస్తంభన, మానసిక సమస్యలు, అవయవాల వాపు లాంటివి కనిపించాయి.

నేచర్ మెడిసిన్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. కోవిడ్ వైరస్‌తో సంక్రమణకు సంబంధించిన ప్రాథమిక సంరక్షణ రికార్డు ఉన్న రోగులు వైరస్ బారిన పడని వారి కంటే ప్రారంభ సంక్రమణ అనంతరం 12 వారాల తర్వాత 62 లక్షణాలను చాలా తరచుగా నివేదించారని కనుగొన్నారు.

ఇవి కూడా చదవండి

పరిగణలోకి రాని లక్షణాలు..

‘‘ఈ పరిశోధన.. మహమ్మారి అంతటా రోగులు, వైద్యులు, విధాన రూపకర్తలకు చెబుతున్న వాటిని ధృవీకరిస్తుంది. ధీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు చాలా విస్తృతమైనవి.. జీవనశైలి ప్రమాద కారకాలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వంటి ఇతర కారకాలతో పూర్తిగా లెక్కలోకి రావడం లేదు’’ అని డాక్టర్ షామిల్ హరూన్ చెప్పారు. షామిల్ బర్మింగ్‌హామ్ వర్సిటీలో పబ్లిక్ హెల్త్‌లో అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

జనవరి 2020 – ఏప్రిల్ 2021 మధ్య UKలో 2.4 మిలియన్ల మంది ఆరోగ్య రికార్డులను బృందం విశ్లేషించింది. ఇందులో 4,86,149 మంది ముందస్తు ఇన్‌ఫెక్షన్‌తో ఉన్నారు, ఇతర క్లినికల్ డయాగ్నసిస్‌లకు సరిపోలిన తర్వాత కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన సూచన లేని 1.9 మిలియన్ల మంది ఉన్నట్లు తేలింది. అదనంగా, బృందం కీలకమైన జనాభా సమూహాలు, ప్రవర్తనలను కూడా కనుగొంది. ఇది ప్రజలను దీర్ఘకాల కోవిడ్‌ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతుంది.

మహిళలు, యువకులు లేదా నల్లజాతి, మిశ్రమ లేదా ఇతర జాతికి చెందినవారు.. దీర్ఘకాల కోవిడ్‌ లక్షణాలను అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం సూచిస్తుంది. తక్కువ సామాజిక ఆర్థిక నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు, ధూమపానం చేసేవారు, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వ్యక్తులు, అలాగే అనేక రకాల ఆరోగ్య పరిస్థితుల ఉనికి కూడా నిరంతర లక్షణాలను నివేదించింది.

మహిళల్లో ఎక్కువగా..

‘‘ఉదాహరణకు, మహిళలు స్వయం ప్రతిరక్షక వ్యాధులను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. మా అధ్యయనంలో మహిళలు ఎక్కువ కాలం కోవిడ్‌తో బాధపడే అవకాశాలను చూడటం వలన ఆటో ఇమ్యూనిటీ లేదా ఇతర కారణాలు మహిళల్లో పెరిగిన ప్రమాదాన్ని నివారించవచ్చా.. అని పరిశోధించడంలో మా ఆసక్తిని పెంచుతుంది” అని యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ హెల్త్ రీసెర్చ్‌లో ఫెలో అనురాధ సుబ్రమణియన్ చెప్పారు.

ఈ పరిశీలనలు ఇన్ఫెక్షన్ తర్వాత వచ్చే లక్షణాలకు సంబంధించి చికిత్స చేయడంతోపాటు.. సమస్యలను మరింత తగ్గించడంలో సహాయపడతాయి. వాటిని ఎదుర్కొంటున్న రోగులకు తాము ఎలా సహాయం చేయవచ్చొ స్పష్టంగా తెలుస్తుందని బృందం వెల్లడించింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..