Simone Tata: రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె వ్యాపార సామ్రాజ్యం గురించి తెలిస్తే అవాక్కవాల్సిందే!
Simone Tata: సైమన్ టాటా వ్యాపారంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా చురుకుగా ఉండేది. ఆమె సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. చిల్డ్రన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా (CWI)తో సహా అనేక సామాజిక సంస్థలతో సంబంధం కలిగి..

Simone Tata: ప్రముఖ వ్యాపారవేత్త, లక్మే కాస్మెటిక్స్ సహ వ్యవస్థాపకురాలు సైమన్ టాటా 95 సంవత్సరాల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ఆమె టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, రతన్ టాటా సవతి తల్లి. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లోని కింగ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. తర్వాత ముంబైకి తీసుకువచ్చాక చికిత్స పొందుతూ మృతి చెందారు.
సిమోన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆమె కొలాబాలోని కేథడ్రల్ ఆఫ్ ది హోలీ నేమ్ చర్చిలో అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొంది. ఆమె సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ, లక్మేను దేశంలోని ఐకానిక్ బ్యూటీ బ్రాండ్‌గా మార్చడమే కాకుండా, వెస్ట్‌సైడ్‌ను ప్రారంభించడం ద్వారా భారతీయ రిటైల్ రంగాన్ని కూడా పునర్నిర్మించిందని టాటా గ్రూప్ పేర్కొంది. ఆమె కుటుంబంలో ఆమె కుమారుడు నోయెల్ టాటా, కోడలు ఆలూ మిస్త్రీ, ఆమె పిల్లలు నెవిల్లే, మాయ, లియా ఉన్నారు.
లక్ష కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్మించిన వ్యాపారవేత్త:
జెనీవా విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన సైమన్ టాటా, తరువాత భారత వ్యాపార చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా మారి, రూ.1 ట్రిలియన్ విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తుందని బహుశా ఆమెకు తెలియదు. స్విట్జర్లాండ్‌లో జన్మించిన సైమన్ టాటా, 1950లలో మొదటిసారి భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారతదేశంతో సంబంధం ప్రారంభమైంది. ఆమె పారిశ్రామికవేత్త టాటాను కలిసింది. 1955లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తదనంతరం ఆమె ముంబైని తన నివాసంగా మార్చుకుంది.
లక్మేను జీరో నుండి పైకి తీసుకెళ్లిన మహిళ:
1960ల ప్రారంభంలో సిమోన్ టాటా లక్మే బోర్డులో చేరారు. ఆ సమయంలో లక్మే టాటా ఆయిల్ మిల్స్ చిన్న అనుబంధ సంస్థ. కానీ ఆమె చతురత, వ్యాపార దృష్టి దానిని కొత్త శిఖరాలకు చేర్చింది. 1961లో ఆమె మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1982లో ఆమె చైర్‌పర్సన్ అయ్యారు. ఆమె నాయకత్వంలో లక్మే భారతీయ మహిళలలో ఇష్టమైన కాస్మెటిక్ బ్రాండ్‌గా మారింది.
వెస్ట్‌సైడ్ ప్రారంభం:
1996లో లక్మీని హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్ (ఇప్పుడు HUL)కి విక్రయించినప్పుడు టాటా గ్రూప్ ఆ నిధులను ఉపయోగించి ట్రెంట్ అనే కొత్త కంపెనీని ప్రారంభించింది. ఈ ట్రెంట్ వ్యాపార సంస్థ వెస్ట్‌సైడ్‌కు పునాది వేసింది. ఇది నేడు భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్‌లలో ఒకటి. రిటైల్ ప్రపంచంలోకి ఈ దార్శనిక చర్య టాటా గ్రూప్ వ్యాపార పోర్ట్‌ఫోలియోను రూపొందించింది.
సైమన్ టాటా వ్యాపారంలోనే కాకుండా సామాజిక సేవలో కూడా చురుకుగా ఉండేది. ఆమె సర్ రతన్ టాటా ఇన్స్టిట్యూట్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. చిల్డ్రన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా (CWI)తో సహా అనేక సామాజిక సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారు. ఆమె ఇండియా ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్‌కు ట్రస్టీగా కూడా ఉన్నారు. అక్కడ ఆమె కళలు, విద్యా రంగానికి గణనీయమైన కృషి చేశారు.
2006లో పదవీ విరమణ చేసే వరకు సైమన్ ఆమె తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించారు. అప్పటి నుండి ఆమె చాలా తక్కువసార్లు బహిరంగంగా కనిపించారు. రతన్ టాటా మరణం తర్వాత ఆయన అంత్యక్రియలకు సిమన్ చివరిసారిగా హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Kitchen Tip: నిమ్మకాయ ముక్కను ఫ్రిజ్‌లో పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?
ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్.. రూ.15 వేల డిపాజిట్‌తో చేతికి రూ.25 లక్షలు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








