Lizard in chicken salad: చికెన్ సలాడ్ తింటున్నారా..? జాగ్రత్త అది బల్లి సలాడ్ కావచ్చు..!
చికెన్ సలాడ్ తినాలనిపించి తన స్నేహితులతో కలిసి ఓ ప్రసిద్ది చెందిన ఇటాలియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు ఓవ్యక్తి.. చకచకా చికెన్ సలాడ్ ఆర్డర్ చేశాడు.
చికెన్ సలాడ్ తినాలనిపించి తన స్నేహితులతో కలిసి ఓ ప్రసిద్ది చెందిన ఇటాలియన్ రెస్టారెంట్‌కు వెళ్లాడు ఓవ్యక్తి.. చకచకా చికెన్ సలాడ్ ఆర్డర్ చేశాడు. క్షణాల్లో వేడి వేడి చికెన్ సలాడ్ టేబుల్‌మీద ప్రత్యక్షమైంది. పొగలు కక్కుతున్న ఆ సలాడ్‌ను ఆస్వాదించేందుకు రెడీ అయ్యాడు. ఇంతలో అతనికి ఆ చికెన్ సలాడ్‌లో చచ్చిన బల్లి కనిపించింది. ఇంకేముంది.. కెవ్వుమంటూ ఒక్క అరుపు అరిచి సిబ్బందిని పిలిచాడు. సలాడ్‌లో ఉన్న బల్లిని వారికి చూపించాడు. జరిగిన పొరబాటుకు సిబ్బంది కస్టమర్‌కి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.ఈ వీడియోను ఓ యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. 4 స్టార్ రేటింగ్ ఉన్న ఫేమస్ రెస్టారెంట్‌లో కూడా నాణ్యత లేదని వాపోయాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. సలాడ్‌లో చనిపోయిన బల్లిని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. మరికొందరు ఆ కేఫ్‌లో తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..
Bus Shelter – Buffalo: బస్ షెల్టర్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..