Son and parents: కలియుగ శ్రవణుడు.. తల్లిదండ్రులను కావడిలో మోస్తూ తీర్ధ యాత్రకు వెళ్లిన యువకుడు..

Son and parents: కలియుగ శ్రవణుడు.. తల్లిదండ్రులను కావడిలో మోస్తూ తీర్ధ యాత్రకు వెళ్లిన యువకుడు..

Anil kumar poka

|

Updated on: Jul 26, 2022 | 5:50 PM

పురాణాల్లో శ్రవణకుమారుడి కథ అందరికీ తెలిసిందే.. అంధులైన తన తల్లిదండ్రుల కోరికను తీర్చేందుకు శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను కావడిలో ఇరువైపులా కూర్చోబెట్టుకుని...


పురాణాల్లో శ్రవణకుమారుడి కథ అందరికీ తెలిసిందే.. అంధులైన తన తల్లిదండ్రుల కోరికను తీర్చేందుకు శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను కావడిలో ఇరువైపులా కూర్చోబెట్టుకుని తన భుజం మీద ఆ కావిడిని మోస్తూ.. తీర్ధయాత్రలు చేశాడని మనం చదువుకున్నాం. తాజాగా ఓ యువకుడు తన తల్లిదండ్రుల కోర్కె తీర్చేందుకు శ్రవణకుమారిడిలా మారాడు. తన తల్లిదండ్రులను కావడిలో ఎత్తుకుని కన్వర్ యాత్రకు బయలుదేరాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను ఐపిఎస్ అధికారి అశోక్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది తమ వృద్ధ తల్లిదండ్రులను తృణీకరిస్తున్నారు.. ఇంటి నుండి బయటకు వెళ్లగొడుతున్నారు.. లేదా తమ తల్లిదండ్రులతో నివసించడానికి ఇష్టపడడం లేదు అంటూ కామెంట్ కూడా ఈ వీడియోకు జత చేశారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో అందుకు వ్యతిరేకంగా కనిపిస్తోందని అన్నారు. కేవలం 11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో ప్రజల హృదయాలను తాకింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కలియుగ శ్రవణకుమారుడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 26, 2022 05:50 PM