Tamilisai Soundararajan: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన తమిళిసై..

Tamilisai Soundararajan: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన తమిళిసై..

Anil kumar poka

|

Updated on: Jul 26, 2022 | 5:44 PM

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి చికిత్స చేసి ప్రాణాపాయ స్థితినుంచి కాపాడారు. వారణాసి పర్యటనకు వెళ్లిన గవర్నర్‌...


తెలంగాణ గవర్నర్‌ తమిళిసై తన వృత్తి ధర్మాన్ని చాటుకున్నారు. విమాన ప్రయాణంలో అస్వస్థతకు గురైన వ్యక్తికి చికిత్స చేసి ప్రాణాపాయ స్థితినుంచి కాపాడారు. వారణాసి పర్యటనకు వెళ్లిన గవర్నర్‌ తమిళిసై జూలై 22న ఢిల్లీ-హైదరాబాద్‌ ఇండిగో విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో విమానంలో ఓ వ్యక్తికి తీవ్రంగా ఛాతి నొప్పివచ్చింది. అది గమనించిన విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉంటే చికిత్స చేయాల్సిందిగా కోరారు. దాంతో వెంటనే గవర్నర్‌, డాక్టర్‌ తమిళిసై స్పందించి ఆ వ్యక్తికి ప్రథమచికిత్స చేశారు. దాంతో ఆ వ్యక్తి కోలుకున్నారు. తనకు చికిత్స చేసి కాపాడిన గవర్నర్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రయాణికులు కూడా గవర్నర్‌ను ప్రశంసించారు. ఇక ప్రయాణికుడి పరిస్థితిని గమనించి సరైన సమయంలో స్పందించిన విమాన సిబ్బందిని తమిళిసై అభినందించారు. విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించిన కిట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే విమాన ప్రయాణాల్లో వైద్యులు ఎవరైనా ఉంటే ముందే వారి వివరాలను తెలుసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. విమాన సిబ్బందికి కూడా సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ పొందితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సామాన్యులు కూడా సీపీఆర్ చేసే విధానం అవగాహన కలిగి ఉంటే ఆపద సమయంలో ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్‌ సూచించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jathiratnam: ఓరి బుడ్డోడా.. బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌ అనిపించినావ్‌గా.. అసలైన జాతిరత్నం..

Bus Shelter – Buffalo: బస్‌ షెల్టర్‌ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా గేదె.. దెబ్బకు దిగొచ్చిన అధికారులు..

Published on: Jul 26, 2022 05:44 PM