Crime News: హారన్ కొట్టినా తప్పుకోవా..? సైకిల్‌పై వెళ్తున్న చెవిటి వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన బాలిక..

ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తాను హారన్ కొడుతుంటే జరగడం లేదని బాలిక కత్తితో పొడిచి మరి చంపింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ కంకలిపారా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది.

Crime News: హారన్ కొట్టినా తప్పుకోవా..? సైకిల్‌పై వెళ్తున్న చెవిటి వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన బాలిక..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2022 | 11:42 AM

Raipur shocking incident: క్షణికావేశంలో కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా సాటివారిపై దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఓ బాలిక.. బధిర వ్యక్తి ప్రాణాలు తీసింది. రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తాను హారన్ కొడుతుంటే జరగడం లేదని బాలిక కత్తితో పొడిచి మరి చంపింది. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ కంకలిపారా ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలిక వికలాంగుడిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, సైకిల్‌పై వస్తున్న వినికిడి లోపం ఉన్న బాధితురాలి హారన్‌కు స్పందించకపోవడంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను అరెస్టు పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

15 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి స్కూటర్‌పై వెళుతోంది. ఈ క్రమంలో సైకిల్‌పై వెళ్తున్న బాధితుడు సుదామ లాడర్‌ను అధిగమించేందుకు ఆమె పదే పదే హారన్‌ మోగించింది. అయితే సుదామ లాడర్‌ (40) బధిరుడు (దివ్యాంగుడు) కావడంతో అతనికి వినిపించలేదు. తనకు కావాలనే అడ్డుపడుతున్నాడని బాలిక కోపంతో తన స్కూటర్‌ను ఆపి, లాడర్‌పై అరవడం ప్రారంభించింది. ఆ తర్వాత బాలిక తన వద్ద ఉన్న కత్తితో సుదామ లాడర్ మెడపై పొడిచింది. దీంతో లాడర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

ఈ ఘటన తర్వాత బాలిక తన తల్లిని వదిలి అక్కడి నుంచి పారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మందిర్ హసౌద్ ప్రాంతంలో బాలికను అదుపులోకి తీసుకున్నారు. కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ