Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: ఆర్కేబీచ్‌లో అసలేం జరిగింది.. పెళ్లి రోజు నాడే సముద్ర తీరంలో మహిళ అదృశ్యం.. భర్త పక్కనుండగానే..

ర్త పక్కనే ఉన్న భార్య నిమిషంలోనే ఎలా మాయమైందన్న విషయం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. విశాఖ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Vizag: ఆర్కేబీచ్‌లో అసలేం జరిగింది.. పెళ్లి రోజు నాడే సముద్ర తీరంలో మహిళ అదృశ్యం.. భర్త పక్కనుండగానే..
Visakhapatnam
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 26, 2022 | 4:04 PM

Visakhapatnam rk beach: విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో అదృశ్యం అయిన సాయి ప్రియ ఆచూకీ కోసం సెర్చ్‌ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంతకీ సాయి ప్రియ గల్లంతయ్యిందా? అక్కడినుంచి వేరే చోటికి వెళ్లిపోయిందా? నిన్న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అసలేం జరిగింది? భర్త పక్కనే ఉన్న భార్య నిమిషంలోనే ఎలా మాయమైందన్న విషయం ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. విశాఖ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌ – సాయి ప్రియలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. నిన్న మ్యారేజ్ డే కావడంతో విశాఖ వెళ్లారు. ఉదయం సింహాచలం గుడికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసి సాయంత్రం బీచ్‌కి వెళ్లారు. ఇద్దరూ ఫోటోలు దిగుతూ సముద్రం ఒడ్డున కాలక్షేపం చేశారు. అయితే శ్రీనివాస్‌ సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు చూస్తుండగా పక్కనే ఉన్న సాయిప్రియ కనిపించుకుండా పోయింది. భార్య కనిపించకపోవడంతో కంగారుపడ్డ భర్త పరిసర ప్రాంతాల్లో గాలించాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో నిన్న రాత్రంతా త్రీటౌన్‌ పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఇవాళ మళ్లీ ఆచూకీ రెండు హెలికాప్టర్ ల ద్వారా, కోస్ట్ గార్డ్ నేవీల సహాయంతో గాలిస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామంటున్నారు. బిడ్డ కనిపించకపోవడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. బీచ్‌కి వెళ్లొస్తామని వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సాయి ప్రియ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.

పలు అనుమానాలు?

ఇవి కూడా చదవండి

కొద్ది రోజులుగా సాయి ప్రియ పుట్టింట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అదృశ్యం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ఆమెను సముద్రంలోకి తోసేశారా? ఆ సమయంలో బీచ్‌లో అంతమంది ఉంటే.. ఎవరూ గమనించలేదా? సాయి ప్రియది నిజంగా గల్లంతేనా? ఒక్క నిమిషంలో కనిపించకుండా ఎలా పోయింది? కాళ్లు కడుక్కోవడానికే సముద్రం దగ్గరికి వెళ్లిందా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు బీచ్ లో కొట్టుకుపోయిందా? లేదా మరేదన్న జరిగిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు

విశాఖ ఆర్కే బీచ్‌లో..

విశాఖ ఆర్కే బీచ్‌లో ఈ ఏడాదిలో ఇది రెండో గల్లంతు సంఘటనగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1న కూడా విశాఖ ఆర్కే బీచ్‌లో ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. ఒడిశా, హైదరాబాద్‌లకు చెందిన రెండు బృందాలలోని 13 మంది యువతీ యువకులు స్నానానికి సముద్రంలో దిగారు. అలల ధాటికి వీరు నీటిలో మునిగిపోగా, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న లైఫ్ గార్డులు, పోలీసులు రెస్క్యూ చేసి నలుగురిని కాపాడగా, మరో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒక యువతి సహా నలుగురు గల్లంతయ్యారు. ఒక యువతి, మరో యువకుడి మృతదేహాలు లభించగా, మిగిలిన ఇద్దరి జాడ తెలియలేదు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..