Adivi Sesh: అడవి శేష్‌ గ్లామర్‌ సీక్రెట్‌ ఎంటో తెలుసా.? ఆసక్తికర విషయాలు పంచుకున్న యంగ్‌ హీరో..

Adivi Sesh: 'పంజా' చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో అడవి శేష్‌. ఇక 2018లో వచ్చిన 'గూడఛారి' సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు...

Adivi Sesh: అడవి శేష్‌ గ్లామర్‌ సీక్రెట్‌ ఎంటో తెలుసా.? ఆసక్తికర విషయాలు పంచుకున్న యంగ్‌ హీరో..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2022 | 9:50 AM

Adivi Sesh: ‘పంజా’ చిత్రంలో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు యంగ్‌ హీరో అడవి శేష్‌. ఇక 2018లో వచ్చిన ‘గూడఛారి’ సినిమాతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులకు అట్రాక్ట్‌ చేశాడు. స్టోరీ సెలక్షన్‌లో వైవిధ్యం, నటనలో పరిపక్వతతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ యంగ్‌ హీరో తాజాగా మేజర్‌ చిత్రంతో పాన్‌ ఇండియాగా మారాడు. ఇక ప్రస్తుతం హిట్‌ సీక్వెల్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేష్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీరు అందంగా ఉండడానికి గల కారణం ఏంటన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నేను మందు, పొగ, డ్రగ్స్, నాన్ వెజ్‌కు దూరంగా ఉంటా. సమయానికి నిద్రపోతాను. ప్రపంచంలో జరిగే ప్రతీ చెడు తెల్లవారుజామున 2 గంటల తర్వాత జరుగుతుంది. ఆ సమయంలో నేను మెలకువగా ఉండను’ అని చెప్పుకొచ్చాడు. ఇక నాగార్జున మేన కోడలు సుప్రియ యార్లగడ్డతో అడవి శేష్‌ వివాహం చేసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే తాజా ఇంటర్వ్యూలో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయిందని ప్రశ్నించగా.. ‘ఇది కాంప్లికేటెడ్‌గా ఉంది’ అంటూ సమాధానం దాటేశాడు. ఇక పెళ్లి ఎప్పుడన్న దానికి బదులిస్తూ.. ‘మా అమ్మనాన్నలు నాకు తెలుగు అమ్మాయితో భారతీయ సంప్రదాయంలోనే వివాహ చేయాలని చూస్తున్నారు. కానీ నేను మాత్రం ప్రపంచంలో ఏ మూలనుంచి వచ్చిన అమ్మాయినైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..