కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కపుల్‌ను బెదిరించింది ఇతడే.. అసలు విషయం తెలిస్తే షాక్

ప్రజంట్ కత్రినా సల్మాన్ ఖాన్ టైగర్ త్రీలో యాక్ట్ చేస్తుండగా.. విక్కీ.. గోవిందా నామ్ మేరా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, డుంకీ సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా ఇప్పుడు ఈ కపుల్‌కు బెదిరింపులు వచ్చాయి.

కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ కపుల్‌ను బెదిరించింది ఇతడే.. అసలు విషయం తెలిస్తే షాక్
Katrina Kaif, Vicky Kaushal
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 25, 2022 | 10:26 PM

Bollywood: బాలీవుడ్ స్టార్ కపుల్  కత్రినా కైఫ్(Katrina Kaif)- విక్కీ కౌశల్(Vicky Kaushal ).. ఈ ఇద్దర్నీ చంపేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు మొదలయ్యాయి. మన్వీందర్ అనే యువకుడు.. పదే పదే తన ఇన్ స్టాలో తమను బెదిరిస్తున్నాడని కంప్లయింట్ చేశారు కత్రినా- విక్కీ జోడి. మనీందర్ కత్రినాను వెంటాడుతున్నాడనీ.. ఈ విషయంపై 506- 2, 354- డి.. కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు శాంతాక్రజ్ పోలీసులు. నాలుగేళ్లుగా ప్రేమించుకుని.. గత ఏడాది ఒక్కటైంది కత్రినా- విక్కీ జంట. ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. కత్రినా సల్మాన్ ఖాన్ టైగర్ త్రీలో యాక్ట్ చేస్తుండగా.. విక్కీ.. గోవిందా నామ్ మేరా, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, డుంకీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటీ రెండు సార్లు కాదు.. పదే పదే అతడిలాంటి సోషల్ మీడియా పోస్ట్ లు చేస్తుండటంతో.. అలెర్ట్ అయ్యింది కత్రినా- విక్కీ జంట. వెంటనే పోలీసులకు కంప్లయింట్ చేయగా.. అతడి వివరాలను రాబట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

ఇతడి ఇన్ స్టాగ్రామ్ చూసిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. కత్రినాను చంపుతానని బెదిరిస్తున్న ఇతడు.. ఆమెతో పెళ్లయినట్టు వీడియోలను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇంతకీ ఎవరీ మన్విందర్ అని ఆరా తీసిన పోలీసులకు ఇతడు కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టు గుర్తించారు. బేసిగ్గా మన్వీందర్ సింగ్ కి కత్రినా అంటే ఎంతో ఇష్టమనీ.. ఆమెను పెళ్లి కూడా చేస్కోవాలనుకున్నాడనీ.. అయితే గతేడాది కత్రినా విక్కీతో కలసి పెళ్లిపీటలెక్కడంతో.. ఇతడి ఆశలు అడియాశలయ్యాయనీ తెలుసుకున్నారు. కత్రినాను చంపేస్తానని బెదిరిస్తున్న ఇతడిపై ఐటీ యాక్ట్ 67 కింద కూడా కేసు పెట్టారు.. పోలీసులు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?