Devil in Jail: రాత్రివేళ గోడపై నిశ్శబ్ధంగా కూర్చున్న దెయ్యం.. ఆత్మను చూసి హడలిపోతున్న జైలు ఖైదీలు..

Devil in Jail: సాధారణంగా దెయ్యం పేరు చెబితేనే భయపడిపోతుంటారు. అలాంటి కళ్లముందే కనిపిస్తే.. పరిస్థితి ఏంటి?. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని

Devil in Jail: రాత్రివేళ గోడపై నిశ్శబ్ధంగా కూర్చున్న దెయ్యం.. ఆత్మను చూసి హడలిపోతున్న జైలు ఖైదీలు..
Devil
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 26, 2022 | 9:39 AM

Devil in Jail: సాధారణంగా దెయ్యం పేరు చెబితేనే భయపడిపోతుంటారు. అలాంటి కళ్లముందే కనిపిస్తే.. పరిస్థితి ఏంటి?. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లా జైలులో అధికారులు, సిబ్బంది, ఖైదీలు సహా అందరూ ఈ పరిస్థితి ఎదుర్కొన్నారు. జైలు ఆవరణలో దెయ్యాలు కనిపిస్తున్నాయని విధులు నిర్వహిస్తున్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే జైలులో పని చేసిన ముగ్గురు సూపరింటెండెంట్లు వివిధ కారణాలతో మృతి చెందారు. వారే ఇప్పుడు జైలులో దెయ్యాల రూపంలో తిరుగుతున్నారని సిబ్బంది వణికిపోతున్నారు. ఈ ఘటనపై డిప్యూటీ జైలర్ రాఘవేంద్రకు సమాచారం అందించారు. దీంతో డిప్యూటీ జైలర్‌తోపాటు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చాలా సేపు జైలు క్యాంపస్‌ను పరిశీలించారు. అనంతరం జిల్లా జైలులో భద్రత పెంచి, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు.

జైలు క్యాంపస్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది దెయ్యాలు చూశామని చెబుతుండగా.. వైరల్ అవుతున్న ఫోటోలు అవాస్తవం అని జైలు సూపరింటెండెంట్ సంజయ్ రాయ్ కొట్టిపాడేశారు. వీరు ఇంతలా భయపడటానికి పక్కా కారణం ఉందని జైలు సిబ్బంది చెబుతున్నారు. జూలై 22న శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో జిల్లా కారాగారంలోని గేట్ నంబర్ 2 ముందు ఉన్న బెంచ్‌పై నీడలాంటి ఆత్మ కనిపించిందని కానిస్టేబుల్ చెబుతున్నాడు. డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ ఆ ఆత్మను మొబైల్ ఫోన్‌లో ఫోటో తీశాడు.

దెయ్యం నిజంగానే కనిపించిందా..? నీడ ఫోటోను కానిస్టేబుల్ తన సహచరులతో కలిసి జైలు సూపరింటెండెంట్, డిప్యూటీ జెలర్‌కు చూపించారు. ఈ వార్త అంతటా వ్యాపించడంతో పోలీస్ యంత్రాంగంలో కలకలం రేగింది. సమీప ప్రాంత ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కాగా, కానిస్టేబుల్ చెబుతున్నది నిజమేనా? అని నిర్ధారించుకునేందుకు డిప్యూటీ జైలర్ ఘటనా స్థలికి వచ్చారు. సిబ్బందితో కలిసి చాలాసేపు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. కానీ, ఎక్కడా ఆత్మ కనిపించలేదు. అదంతా వట్టిదేనంటూ కొట్టిపారేశారు. అదే సమయంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. లైట్లు ఏర్పాటు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..