AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Price Hike: ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా? పార్లమెంట్ చెప్పిన వివరాలివే..

Fuel Price Hike: కరోనా ముందు వరకు అంటే 2018 వరకూ రూ.80 వద్దనే ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. గత రెండేళ్లుగా విపరీతంగా పెరిగిపోయాయి.

Fuel Price Hike: ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నిసార్లు పెరిగాయో తెలుసా? పార్లమెంట్ చెప్పిన వివరాలివే..
Petrol And Diesel
Shiva Prajapati
|

Updated on: Jul 26, 2022 | 9:02 AM

Share

Fuel Price Hike: కరోనా ముందు వరకు అంటే 2018 వరకూ రూ.80 వద్దనే ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. గత రెండేళ్లుగా విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. 2021 2022 కు సంబంధించి పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 78 రెట్లు, 76 రెట్లు పెరిగాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపునకు సంబంధించి.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా అడిగిన ప్రశ్నలకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

ఈ వివరాలను ఎంపీ రాఘవ్ చద్దా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. సామాన్యులను లూటీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అని ఈ వివరాలతో స్పష్టమైందని చద్దా పేర్కొన్నారు. ‘‘రాజ్యసభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గత ఏడాదిలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 78 సార్లు, 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇది సామాన్యులను లూటీ చేస్తున్న ప్రభుత్వం అని స్పష్టమైంది.’’ అని చద్దా అన్నారు.

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ ప్రభుత్వ రంగ OMCలు జూన్ 16, 2017 నుండి దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకపు ధర (RSP) రోజువారీ సవరణను అమల్లోకి తీసుకువచ్చాయి.

ఇదిలావుండగా, సభలో నిత్యావసరాల ధరలు, చమురు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసనలు, నినాదాలు చేసినందుకు నలుగురు కాంగ్రెస్ ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్.. పార్లమెంట్ సమావేశాల జరిగినంత కాలం ఉంటుంది. నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, రమ్య హరిదాస్, జోతిమణి, టీఎన్ ప్రతాపన్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..